Gottimukkala padma rao
-
కూకట్‌పల్లిలో టీఆర్ఎస్కు ఝలక్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల వేళ తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. టికెట్ ఆశించి భంగపడ్డవారు, అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నవారు.. చివరి నిమిషాల్లో ఆయా పార్టీలకు గుడ్ బై చెబుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గొట్టిముక్కల పద్మరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు. ఈ లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘పార్టీని ఇల్లులా.. కేసీఆర్‌ను ఇంటి పెద్దదిక్కులా(తండ్రిలా) భావించాను. పార్టీలో ఇన్నాళ్లు చాలా మందికి అన్యాయం జరిగినా ఓపికతో సహించాను. ఇకనైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశించి ఎదురు చూశాను. అయినా.. ఎటువంటి మార్పులేదు. తెలంగాణ వాదం అనే పదాన్ని ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. మీలో మార్పు రాకపోగా.. పార్టీ పక్కదారుల పడుతోంది. ఇక పార్టీ గాడిలో పడదని భావించి పార్టీకి, కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నాన’ని ఆయన లేఖలో పేర్కొన్నారు. మరో కొద్ది రోజుల్లో ఎన్నికల జరగనుండగా.. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే గొట్టిముక్కల రాజీనామా చేయడం కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ప్రేమలో స్వార్థం
అన్ని ప్రేమలూ ఒకలా ఉండవ్. ప్రేమ ముసుగులో ఆర్థిక ప్రయోజనాలు పొందాలనుకునేవారు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో రాజు కుంపట్ల దర్శకత్వంలో జనార్దన్ మందుముల నిర్మిస్తున్న చిత్రం ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. సతీష్, మెరీనా నాయకా నాయికలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నిర్మాత గొట్టిముక్కల పద్మారావు ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ ముసుగులో స్వార్థం అనేది ఈ చిత్రం ప్రధానాంశం. జాన్ స్వరపరచిన పాటలు, మురళి ఛాయాగ్రహణం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘టైటిల్ వినగానే.. ఇది బూతు చిత్రం అనుకునే అవకాశం ఉంది. కానీ, వినోద ప్రధానంగా సాగే ఆహ్లాదకర చిత్రం ఇది. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. -
తలరాతలు మార్చిన బోగస్ ఓట్లు!
రెండు చోట్ల ఓటుపై కోర్టుకు: పద్మారావు టీడీపీ గెలుపునకు కారణం అదే! హైదరాబాద్, సాక్షి: ఇటు హైదరాబాద్ శివార్లలో, అటు సీమాంధ్రలో ఓటు హక్కు కలిగినవారు రెండు చోట్లా ఓటు వేయడం టీడీపీకి కలిసి వచ్చిందని కూకట్పల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గొట్టిముక్కల పద్మారావు చెప్పారు. నగర శివార్లలో టీడీపీ తొమ్మిది చోట్ల విజయం సాధించడానికి ఈ విధమైన బోగస్ ఓట్లే కారణమని మంగళవారం ఆయన మీడియూతో అన్నారు. ‘‘ఒక వ్యక్తి రెండు చోట్ల ఓటు వేసి అభ్యర్థుల గెలుపోటములు శాసించడం రాజ్యాంగ విరుద్ధం. ఓటరుకు ఒక్కచోటే ఓటుహక్కు ఉండాలి. రెండుచోట్ల ఓటువేసే అవకాశం కల్పించడం ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తప్పిదం. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రాంతం వారికి ఆప్షన్ ఇచ్చి వె ంటనే బోగస్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. రెండుచోట్ల ఓటు వేసిన అంశంపై కోర్టును ఆశ్రయిస్తా. కేంద్ర , రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కూడా ఫిర్యాదు చేస్తా. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే భారీ సంఖ్యలో సెటిలర్లు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పక్కాప్లాన్‌తో హైదరాబాద్‌లో సీమాంధ్రవారి ఓట్లు అధిక సంఖ్యలో ఉండేలా ప్లాన్ చేశారు. వారితో రెండు చోట్ల ఓటు వేయించి లబ్ధి పొందారు..’’ అని పద్మారావు చెప్పారు.