ఏప్రిల్‌లో ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ | Romance With Finance to release in April | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’

Published Thu, Mar 26 2015 3:39 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

ఏప్రిల్‌లో ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ - Sakshi

ఏప్రిల్‌లో ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’

చిత్ర దర్శకుడు రాజు కుంపట్ల
 మామిడికుదురు :యువతకు మంచి సందేశాన్ని అందించే అంశాలతో ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ చిత్రాన్ని రూపొందించామని, ఈ చిత్రం అన్నివర్గాల పేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర దర్శకుడు రాజు కుంపట్ల తెలిపారు. ఆయన స్వగృహం మండల పరిధిలోని ఆదుర్రు శివారు మోరిపొలంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చిత్ర విశేషాలను రాజు వివరించారు. ప్రేమ, హాస్యం, కుటుంబ కథా నేపథ్యంలో ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని, దీనిని ఏప్రిల్‌లో విడుదల చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ చిత్రం షూటింగ్ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలోనే చేశామన్నారు. ఇందులో ఐదు పాటలు ఉన్నాయని చెప్పారు. ఉగాది సందర్భంగా ఆడియోను రిలీజ్ చేశామని, ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు.
 
 జనార్దన్ మందుముల, సుదర్శన్ సరికొండ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని రూపొందించామని, సతీష్‌బాబు, సురేష్ దేశరాజు, మెరీనా, ప్రియాంక నటించారని చెప్పారు. ఈ చిత్రానికి వీరూ పోట్ల సంగీతం అందించగా, మురళీ కెమెరామన్‌గా పని చేశారని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ధనరాజు, చంటి, తాగుబోతు ఫణి, సురేష్, జెన్నీఫర్, ఉమ, తదితరులు ఈ చిత్రంలో నటించారని రాజు తెలిపారు.‘డ బ్బుంటే ఏ అమ్మాయిని అయినా వశ పర్చు కోవచ్చు అనుకునే అబ్బాయిలు’, ‘డబ్బున్న అబ్బాయిలను వాడుకుని వదిలేయవచ్చు అనుకునే అమ్మాయిలు’ ఈ పరిణామాల నేపథ్యంలో ఎదురయ్యే ఇబ్బందులు, తల్లితండ్రులు తీసుకోవల్సిన జాగ్రత్తలతో ఈ చిత్రం రూపొందించామన్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్, రవిరాజా పినిశెట్టి, వీరూపోట్ల, శివకుమార్ తనకు గురువులని రాజు కుంపట్ల పేర్కొన్నారు. తదుపరి ప్రముఖ నటునితో చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తానన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement