'తొలిసారి నాన్న కళ్లలో కన్నీళ్లు చూశా.. ' | 'Coolie' accident was a rebirth: Amitabh | Sakshi
Sakshi News home page

'తొలిసారి నాన్న కళ్లలో కన్నీళ్లు చూశా.. '

Published Sun, Aug 2 2015 4:31 PM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

'తొలిసారి నాన్న కళ్లలో కన్నీళ్లు చూశా.. '

'తొలిసారి నాన్న కళ్లలో కన్నీళ్లు చూశా.. '

ముంబై: హిందీ చిత్రం కూలీ ప్రమాద ఘటన తనకు పునర్జన్మ వంటిదని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. 33 ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రమాదం నుంచి తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు.  కూలీ ప్రమాద ఘటన వివరాలను 72 ఏళ్ల అమితాబ్ ట్విట్టర్లో తెలియజేశారు. ఆస్పత్రి నుంచి ఇంటి వచ్చాక తన తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ కన్నీపర్యంతమయ్యారని గుర్తు చేసుకున్నారు. తండ్రి కళ్లలో తాను కన్నీళ్లు చూడటం అదే తొలిసారి అమితాబ్ ట్వీట్ చేశారు. తండ్రి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను అమితాబ్ పోస్ట్ చేశారు.

1982 ఆగస్టు 2న బెంగళూరులో కూలీ షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఆగస్టుల 2 తనకు పునర్జన్మ వంటిదని అమితాబ్ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement