Harivansh Rai Bachchan
-
నాన్న కంటతడి పెట్టడం అదే ప్రథమం: సూపర్ స్టార్
బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. కుటుంబం, వర్క్‌కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంటారు. అప్పుడప్పుడు త్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేస్తూ.. దాని వెనక ఉన్న జ్ఞాపకాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు బిగ్ బీ. తాజాగా ఇలాంటి ఫోటోని ఒకదాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు సీనియర్ బచ్చన్. దీనిలో అమితాబ్ తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ ఆశీర్వాదం కోసం వంగి ఆయన పాదాలకు నమస్కరిస్తున్నారు. పక్కనే నిల్చున్న చిన్నారి జూనియర్ బచ్చన్ తండ్రిని ఆస్తకిగా గమనిస్తుండటం ఈ ఫోటోలో చూడవచ్చు. అయితే తొలుత ఈ ఫోటోని ఓ అభిమాని ట్విట్టర్లో షేర్ చేశారు. దాన్ని అమితాబ్ తన ఖాతాలో షేర్ చేస్తూ.. దీని వెనక గల కథను అభిమానులతో పంచుకున్నారు. (చదవండి: అతను నన్ను ప్రేమిస్తున్నాడు అంతే..) T 3777 - The caption informs of 45 million on Twitter .. thank you Jasmine, but the picture says a lot more .. Its the moment I came home surviving death after the 'Coolie' accident .. Its the first time ever I saw my Father breaking down ! A concerned little Abhishek looks on ! pic.twitter.com/vFC98UQCDE — Amitabh Bachchan (@SrBachchan) January 9, 2021 ఈ మేరకు అమితాబ్ ‘కూలీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో నేను చావు అంచుల వరకు వెళ్లాను. అదృష్టవశాత్తు కోలుకుని ఇంటికి చేరుకున్నాను. ఆ సమయంలో మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవడం కోసం వంగి ఆయన పాదాలకు నమస్కరించాను. ఆ సమయంలో నన్ను చూసి నాన్నగారు ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టారు. నాన్నను అలా చూడటం నా జీవితంలో అదే మొదటిసారి. ఇక పక్కనే ఉన్న అభిషేక్ మమ్మల్ని ఆసక్తిగా గమనిస్తున్నాడు’ అంటూ ఈ ఫోటో వెనక గల స్టోరిని ట్వీట్ చేశారు.. ఇక తాజాగా శనివారం బిగ్ బీ మరో రికార్డు సృష్టించారు. సీనియర్ బచ్చన్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య శనివారం నాటికి 45 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
అమితాబ్ బచ్చన్ బాధ ప్రపంచం బాధ
సాక్షి, న్యూఢిల్లీ : వారసత్వంగా తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ సాహిత్యంపై తనకు సంక్రమించిన హక్కులు 2063 తర్వాత పబ్లిక్ డొమేన్ (ప్రజల పరిధి)లోకి వెళ్లిపోతాయంటూ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇటీవల తన బ్లాగ్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన తండ్రి హరివంశ్ రాయ్ 2003లో చనిపోయారు. దాంతో వారసత్వంగా ఆయన రాసిన నవలలు, కవితలు, వ్యాసాలపై 2063 వరకు అమితాబ్‌కు సర్వ హక్కులు లభించాయి. 1957 నాటి కాపీరైట్ హక్కుల చట్టం ప్రకారం సాహిత్యం, సంగీతం, కళలు, నాటకాలు, సినిమాలపై ఎవరికైనా 60 ఏళ్ల వరకే కాపీ రైటు ఉంటుంది. ఇంకా అమితాబ్‌కు తాను జీవించినంత కాలం కాపీరైటు హక్కులు ఉంటాయి. అయినా తన వారసులుగా ఆ హక్కులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఉంది. అందుకే ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మాటకొస్తే సినిమాల పరిస్థితి మరీ దారుణం అని చెప్పవచ్చు. ఓ సినిమా తీసి 60 ఏళ్లయితే ఎవరికీ ఆ సినిమాపైనా హక్కులు ఉండవు. ఆ సినిమా ప్రజల పరిధిలోకి వెళుతుంది. అప్పుడు ఆ సినిమాలోని సన్నివేశాలనుగానీ, మాటలనుగానీ, మొత్తంగా కథనుగానీ ఎవరైనా ఉచితంగా కాపీ చేసుకోవచ్చు. ఎవరికి రాయల్టీ కింద అణా పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ లెక్కన బాలీవుడ్ హిందీ చిత్రాలనే పరిగణలోకి తీసుకున్నట్లయితే 1958 సంవత్సరానికి ముందు తీసిన అన్ని సినిమాలు ఇప్పటికే ప్రజల పరిధిలోకి వచ్చాయన్న మాట. 1941లో కమల్ అమ్రోహి తీసిన ‘మహల్’, 1951లో రాజ్‌కపూర్ తీసిన ‘ఆవారా’, 1957లో రాజ్‌కపూరే తీసిన ‘శారద’, 1958లో మెహబూబ్ ఖాన్ తీసిన మదర్ ఇండియా లాంటి చిత్రాలు, 1955లో తెలుగులో ఎల్వీ ప్రసాద్ తీసిన ‘మిస్సమ్మ’, 1951లో బీఎన్ రెడ్డి తీసిన ‘మళ్లీశ్వరి’, 1951లో కేవీ రెడ్డి తీసిన ‘పాతాళభైరవి’, 1957లో కేవీ రెడ్డి తీసిన ‘మాయాబజార్’ లాంటి ఆణిముత్యాలు ఇప్పటికే ప్రజల పరిధిలోకి వచ్చాయి. ఈ సినిమాలను రీమేక్ చేయడానికి, ఈ సినిమాల్లోని సన్నివేశాలను వాడుకునేందుకు చట్ట ప్రకారం ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్న మాట. ఇలా కాపీ రైటు హక్కు భారత్‌లో 60 ఏళ్లు ఉండగా, అమెరికాలో 70 ఏళ్లు ఉంది. ఈ కారణంగా అమెరికాలో ఫ్రాంక్ కాప్ర, ఆర్సన్ వెల్లెస్, ఫ్రిడ్జ్ లాంగ్ చిత్రాలు పబ్లిక్ డొమేన్లోకి వచ్చాయి. సినిమా హాళ్లు, టీవీలే కాకుండా ఇంటర్నెట్, వెబ్సైట్లు లాంటి పలు రకాల ప్రసార మాధ్యమాలు వచ్చినందున 60 ఏళ్లు, 70 ఏళ్లు అంటూ కాపీరైటు ఉండరాదని సినిమా వర్గాలు ఎప్పటి నుంచో వాదిస్తున్నాయి. 60 ఏళ్ల క్రితం నడవక నష్టం వచ్చిన సినిమాకు నేడు మారిన మాధ్యంలో ఆదరణ లభించవచ్చు, డబ్బులూ రావచ్చని నిర్మాతలు అంటున్నారు. సాహిత్యంలోగానీ, కళల్లోగానీ వారసత్వంగా సంక్రమించే హక్కులు శాశ్వతంగా ఉండాలని ఆయా రంగాల వారు డిమాండ్ చేస్తున్నారు. కొత్తకొత్త మాధ్యమాలు మారుమోగుతున్న నేటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే చట్టం మారనూ వచ్చు! -
మా నాన్న కళ్లల్లో మొదటిసారి నీళ్లు చూశాను!
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్‌ని చాలాకాలం తరువాత గుర్తు చేసుకున్నారు. హిందీ కవి దివంగత హరివంశ్ రాయ్ బచ్చన్ కళ్లల్లో నేను మొదటిసారి నీళ్లు చూశానని బిగ్‌బాస్ తన ఇంస్ట్రాగ్రామ్లో పోస్ట్ చేశారు. నేను కూలీ సినిమా షూటింగ్లో ఉన్నపుడు ఓ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానంతరం నేను ఇంటికి వెళ్లాను.. నన్ను చూడగానే ఒక్కసారిగా ఆయన కన్నీంటితో నన్ను కౌగిలించుకొని, ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ ప్రమాదం 1982 జులై 26న బెంగళూరులో జరిగింది. ‘నా జీవితం మొత్తంలో నేను ఎప్పుడూ మా నాన్న కళ్లల్లో నీళ్లు చూడలేదని.. కానీ నేను కూలీ సినిమా షూటింగ్లో ఉన్నపుడు ఓ ప్రమాదానంతరం ఇంటికి వచ్చిన వెంటనే ఆయన నన్ను చూసి గట్టిగా కౌగిలించుకుని, ఒక్కసారిగా కన్నీళ్లతో కూప్పకూలిపోయాడని’ అమితా బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అమితాబ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్న విషయం తెలిసిందే. In my entire life I never ever saw tears in my Father’s eyes .. but when I survived my Coolie accident and came home .. he embraced me and broke down ... for the first time in front of me ... !!a moment captured by the media .. A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on Dec 26, 2017 at 10:50am PST -
'తొలిసారి నాన్న కళ్లలో కన్నీళ్లు చూశా.. '
ముంబై: హిందీ చిత్రం కూలీ ప్రమాద ఘటన తనకు పునర్జన్మ వంటిదని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. 33 ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రమాదం నుంచి తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. కూలీ ప్రమాద ఘటన వివరాలను 72 ఏళ్ల అమితాబ్ ట్విట్టర్లో తెలియజేశారు. ఆస్పత్రి నుంచి ఇంటి వచ్చాక తన తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ కన్నీపర్యంతమయ్యారని గుర్తు చేసుకున్నారు. తండ్రి కళ్లలో తాను కన్నీళ్లు చూడటం అదే తొలిసారి అమితాబ్ ట్వీట్ చేశారు. తండ్రి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను అమితాబ్ పోస్ట్ చేశారు. 1982 ఆగస్టు 2న బెంగళూరులో కూలీ షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఆగస్టుల 2 తనకు పునర్జన్మ వంటిదని అమితాబ్ ట్వీట్ చేశారు. -
మీ సహాయం కోరుతున్నా!
‘‘మా నాన్న హరివంశ్రాయ్ బచ్చన్ గురించి సమగ్ర సమాచారం ప్రపంచానికి తెలియజేయాలనే ఆకాంక్షతో ఓ వెబ్సైట్ ఆరంభించనున్నా’’ అని అమితాబ్ బచ్చన్ ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ కారణం ఉందనీ, ఆయన గురించి పూర్తిగా తెలుసుకోకుండా కొంతమంది తప్పుడు సమాచారం ఇస్తున్నారనీ అమితాబ్ పేర్కొన్నారు. హరివంశ్ రాయ్ బచ్చన్ మంచి కవి. సాహిత్య రంగంలో తన కలం బలం ఏమిటో చూపించిన ఘనుడు. ఆయన స్మారకంగా అమితాబ్ భారీ ఎత్తున ఈ వెబ్‌సైట్‌ను ఆరంభిస్తున్నారు. ‘‘మా నాన్నగారి గురించిన చిన్నపాటి సమాచారం కానీ, ఫొటోలు కానీ మీ వద్ద ఉంటే దయచేసి మాకు పంపించండి. ఆయన రాసిన కవితలు ఉన్నా, ఒకవేళ ఆయనకు సంబంధించిన ఉత్తరాలు ఉన్నా మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా’’ అని అమితాబ్ ట్విట్టర్ ద్వారా విన్నవించుకున్నారు. ఇంకా ఆయన చెబుతూ -‘‘మా నాన్నగారు మంచి సాహితీవేత్త. ఆయన కోసం నేను చేస్తున్న ఈ చిరు ప్రయత్నంలో ఎలాంటి తప్పులు దొర్లకూడదని నా ఆకాంక్ష. మా నాన్న గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే thebachchanfamily@gmail.com అనే ఐడీకి పంపించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను’’ అన్నారు.