Rebirth
-
Rebirth Story: ‘ఆవిడ మా ఆవిడే..’ పునర్జన్మ చెబుతూ హడలెత్తిస్తున్న కుర్రాడు!
పునర్జన్మ... ఇది యావత్ మానవాళికీ అంతుచిక్కని ప్రశ్న. పునర్జన్మ ఉందని కొందరు అంటుంటే, అస్సలు లేదని మరికొందరు వాదిస్తుంటారు. అయితే అప్పుడప్పుడు తమ పునర్జన్మ ఇదేనంటూ పలువురు పూసగుచ్చినట్లు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మైన్పూర్ జిల్లాలో పునర్జన్మకు సంబంధించిన ఒక ఉదంతం కలకలం రేపుతోంది. ఎనిమిదేళ్ల కుర్రాడు తన అమ్మమ్మను తన భార్య అని చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ మాటవినగానే మొదట ఆ కుర్రాడి కుటుంబ సభ్యులు దానిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ కుర్రాడు చెబుతున్న గతంలోని సంఘటనలు విన్నాక కుటుంబ సభ్యులంతా తెగ ఆశ్చర్యపోయారు. పునర్జన్మకు సంబంధించిన ఈ విచిత్ర ఉదంతం ఎలావూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. జూన్ 15న 8 ఏళ్ల అర్యన్ తన తల్లితోపాటు రతన్‌పూర్ గ్రామానికి వచ్చాడు. ఆ కుర్రాడి తల్లి.. ‘వెళ్లి.. అమ్మమ్మ కాళ్లకు దండం పెట్టు’ అని అతనితో చెప్పింది. వెంటనే ఆ కుర్రాడు ‘ఈమె నా అమ్మమ్మ కాదు. నా భార్య’ అని అని చెప్పాడు, అలాగే అక్కడే ఉన్న మేనమామను తన కుమారుడు అని ఆర్యన్ చెప్పాడు. ఆర్యన్ మాటలను తొలుత కుటుంబ సభ్యులు తేలికగా తీసుకున్నారు. అయితే ఆ కుర్రాడు అదే విషయాన్ని పదపదే చెప్పడంతోపాటు, గతంలో వారి కుటుంబంలో జరిగిన అన్ని ఘటనలను పూసగుచ్చినట్లు చెప్పడం మొదలుపెట్టాడు. ఇవన్నీ తన గత జన్మకు సంబంధించిన విషయాలని తెలిపాడు. గత జన్మలో తన పేరు మనోజ్ మిశ్రా అని, 8 ఏళ్ల క్రితం అంటే 2015 జనవరి 9న తాను పొలంలో పని చేస్తుండగా, అక్కడ ఒక రంధ్రం కనిపించిందని, దానిని కాలితో మూసివేసే ప్రయత్నం చేస్తుండగా పాము కరిచిందని తెలిపాడు. తాను వెంటనే స్పృహ కోల్పోయానని, తనను ఆసుపత్రికి తీసుకెళుతుండగా దారిలో మృతిచెందానని చెప్పాడు. పిల్లాడి నోటి నుంచి వచ్చిన ఈ మాటలు వినగానే అక్కడున్నవారంతా హడలెత్తిపోయారు. ఇదంతా వాస్తవమేనని, ఆ కుర్రాడు గత జన్మలో మనోజ్ మిశ్రా అని వారు గుర్తించారు. ఆర్యన్ ఇంకా వివరాలు చెబుతూ తాను చనిపోయిన సమయంలో తన కుమార్తె( ఆర్యన్ తల్లి) గర్భవతి అని తెలిపాడు. తాను చనిపోయాక తన దశదిన కర్మలు ముగిసిన వెంటనే తన కుమార్తె రంజన.. కుమారునికి జన్మనిచ్చిందని అన్నాడు. ఇంత చిన్న కుర్రాడు ఇన్ని విషయాలు తెలియజేయడం చూసిన అక్కడున్నవారంతా తెగ ఆశ్చర్యపోయారు. ఆర్యన్‌ది పునర్జన్మే అంటూ వారు అందరికీ చెబుతున్నారు. ఆర్యన్ తన అమ్మమ్మ నీరజ్ మిశ్రాను తన భార్య అని, మేనమామలైన అనుజ్, అజయ్‌లను తన కుమారులని, తన తల్లి రంజనను తన కుమార్తె అని చెబుతున్నాడు. ఆర్యన్ మేనమామ అజయ్ మాట్లాడుతూ నాలుగేళ్ల వయసు నుంచి ఆర్యన్ గత జన్మ విషయాలను చెబుతున్నాడని, అయితే మేము దీనిని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని, ఇప్పుడు నమ్మక తప్పడం లేదని అన్నారు. ఈ మధ్య ఆర్యన్ చెబుతున్న విషయాలు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయని అన్నారు. ఆర్యన్ అమ్మమ్మ నీరజ్ మిశ్రా ఆ కుర్రాడి మాటలు నిజమేనని చెబుతోంది. ఇది కూడా చదవండి: బంగారు నగరంలో చీకటి సామ్రాజ్యం.. జన జీవనం సాగుతుందిలా.. -
ప్రభుత్వ లెక్కల ప్రకారం 27 ఏళ్లు; అందుకే మళ్లీ పెళ్లి చేసుకుంటున్నా
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అజమ్ఘఢ్ జిల్లాకు చెందిన ఖలీలాబాద్ గ్రామవాసి మృతక్లాల్ బిహారి. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి మరొకరిని పెళ్లి చేసుకుని, కొడుకును తీసుకుని ముబారక్ పూర్‌కి వెళ్లింది. చదువు అబ్బకపోవడంతో బిహారి బనారస్ చీరలు నేయడం నేర్చుకున్నాడు. 22 ఏళ్ల వయసులో తండ్రికి ఊరిలో ఉన్నకొద్ది పాటి స్థలంలో మగ్గాలు పెట్టాలనుకున్నాడు. అందుకు ఆయనకు బ్యాంక్ లోన్ అవసరమైంది. గ్రామంలో ఉంటున్నట్టుగా గుర్తింపు పత్రం కోసం జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడే లాల్ బిహారికి ఆశ్చర్యకర విషయం తెలిసింది. రెవెన్యూ రికార్డులో అప్పటికే లాల్ బిహారీ మరణించినట్లుగా ఉంది.దీనిప్రకారం ప్రభుత్వ రికార్డుల్లో ఆయన చనిపోయాడు. తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు బిహారి 18 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం 64 ఏళ్ల వయసున్న లాల్ బిహారీ ప్రభుత్వ లెక్కల ప్రకారం తన వయస్సు 27 ఏళ్లని అందుకే నా భార్య కర్మీదేవిని మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపాడు. ఆయన మాట్లాడుతూ.. '' 2022లో తమ పెళ్లి జరగనుందని.. 56 ఏళ్ల నా భార్య మెడలో మళ్లీ తాళి కట్టనున్నాను. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1994లో మళ్లీ పుట్టిన నాకు ఇప్పుడు 27 ఏళ్లు. నేను బతికే ఉన్నానని దేశంలో మరింత మందికి తెలియజెప్పేందుకే వివాహం చేసుకుంటున్నా. ఊరిలో ఉన్న వ్యవసాయ భూమిని దక్కించుకునేందుకు దగ్గరి బంధువొకరు చేసిన పని అది.నా ఆస్తిని దక్కించుకునేందుకు మా దగ్గరి బంధువు ప్రభుత్వ అధికారికి 300 రూపాయల లంచం ఇచ్చి నేను జూలై 30, 1976లో మరణించినట్టుగా రాయించాడు. విచిత్రమేమిటంటే ఆ అధికారి ఒకప్పుడు నా మిత్రుడే. లంచానికి ఆశపడి ఎదుటివారికి లాభం చేకూర్చేందుకు అలా చేశాడని తెలిసింది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా బిహారి తన 18 ఏళ్ల పోరాటంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. మొదట్లో ఆయన కేసు విని కొంతమంది లాయర్లు నవ్వితే, మరికొందరు సానుభూతి తెలిపారు. స్థానికులు బిహారీని దెయ్యంగా పిలిచేవారు. చిన్నపిల్లలు ఆయనను చూసి పారిపోయేవారు. అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ బిహారీకి ఆయన భార్య కర్మీదేవి మాత్రం తోడుగా నిలిచింది. ఆమె సహకారంతోనే బిహారి ఒక పథకం ఆలోచించాడు. తాను బతికే ఉన్నానని అధికారులకు తెలియజేసేందుకు ప్రభుత్వ అధికారికి లంచం ఇచ్చిన తన బంధువు కొడుకును కిడ్నాప్ చేశాడు. ఎలాగైనా తన పేరు మీద కేసు రిజిస్టర్ కావాలనుకున్నాడు. ఎన్నికల్లో పోటీ చేయడం, భార్యకు వితంతు పెన్షన్ రాబట్టడం కోసం ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించడం, ‘ముఝే జిందా కరో’ (నన్ను బతికించండి) అనే ప్లకార్డుతో అసెంబ్లీలోకి దూసుకెళ్లడం... ప్రభుత్వ అధికారికి లంచం ఇవ్వజూపుతూ పట్టుబడటం, తన శవ ఊరేగింపు తనే జరుపుకోవడం వంటి అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ విధంగా స్థానిక వార్తల్లోకి ఎక్కాడు. ఆయన చేసిన పోరాటాల ఫలితంగా చివరకు జూన్ 30, 1994లో జిల్లా యంత్రాంగం లాల్ బిహారీ బతికున్నట్టుగా గుర్తించింది. లాల్ బిహారీ పోరాటాన్ని పత్రికల ద్వారా తెలుసుకున్న బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీశ్ కౌశిక్ ఆయన జీవితాన్ని తెరకెక్కించాడు. ‘కాగజ్’గా ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో ప్రధాన పాత్రను ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి పోషించారు. ఇందులో ఆయన భార్య కర్మీదేవిగా మోనాల్ గజ్జర్ నటించారు. ఈ సినిమాకు ప్రముఖ హీరో సల్మాన్‌ఖాన్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. -
ఆరుగురు రైతులకు పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఆరుగురు నిరుపేద రైతు, రైతు కూలీలకు ఉస్మానియా వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. రోజుల తరబడి వెంటిలేటర్లపై ఉండటంతో శ్వాసనాళం కుంచించుకుపోయి ఊపిరి తీసుకోలేకపోతున్న వారికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. మృత్యు ద్వారం వరకు వెళ్లి తిరిగిన వచ్చిన వీరు కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేశారు. ‘హెల్పింగ్ హ్యాండ్’ సౌజన్యంతో ఉస్మానియా కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి జి.శ్రీనివాస్, ఈఎన్టీ విభాగాధిపతి రంగనాథ్‌స్వామి, అనెస్థీషియా విభాగాధిపతి సి.జి.రఘురామ్ల నేతృత్వంలోని వైద్య బృందం నిర్వహించిన ఈ అరుదైన శస్త్రచికిత్స వివరాలివి... అప్పుల బాధతో... అప్పుల బాధకు తట్టుకోలేక నిజామాబాద్ జిల్లా అమృతాపూర్ రైతు బి.సంతోష్(28), మెదక్ జిల్లా నాచారం కౌలు రైతు పి.నర్సింహా(28), మహబూబ్‌నగర్‌కు చెందిన రైతు కూలీ ఎస్.కృష్ణ(24), రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రైతు కూలీ జి.లలిత(28), ఖమ్మం జిల్లా రైతు కుటుంబానికి చెందిన విద్యార్థి వీరన్న(20), మహబూబ్‌నగర్‌కు చెందిన రైతు ఎ.నారాయణ(30) ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వ్యవసాయం కోసం కొందరు... కుటుంబ పోషణకు మరికొందరు అప్పులు చేసి, అవి తీరే మార్గం లేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. చికిత్స కోసం బంధువులు వీరిని ఉస్మానియాకు తీసుకువచ్చారు. చికిత్సలో భాగంగా వైద్యులు బాధితులను 15 నుంచి 25 రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చింది. ఇన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండటం వల్ల ఒత్తిడికి లోనై, ఇన్ఫెక్షన్ వచ్చింది. దీంతో శ్వాసనాళాలు పూర్తిగా కుంచించుకుపోయాయి. వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. మాట పడిపోయింది. వైద్య పరిభాషలో దీన్ని ‘ట్రాకియల్ స్టెనోసిస్’గా పిలుస్తారు. దీనికి చికిత్స ఎంతో క్లిష్టమే కాకుండా ఖరీదు కూడా. ఆరోగ్యశ్రీ పథకంలో వీటికి అనుమతి లేదు. ఈ క్రమంలో ‘హెల్పింగ్ హ్యాండ్’ స్వచ్ఛంద సంస్థతో పాటు ‘ఇన్సైట్ ఔట్రిచ్ ప్రైవేట్ లిమిటెడ్’ వైద్య ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చాయి. ఉదయం 9 నుంచి రాత్రి 10 వరకు... డాక్టర్ జి.శ్రీనివాస్ నేతృత్వంలో వైద్య బృందం సెప్టెంబర్ 23న శస్త్రచికిత్స నిర్వహించింది. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రమించిన వైద్యులు... గొంతుకు చిన్న రంధ్రం చేసి శ్వాస నాళంలో ‘డ్యూరాన్ స్టంట్’ను విజయవంతంగా అమర్చారు. బాధితులకు తిరిగి ఊపిరులూదారు. ఒక్కో స్టంట్‌కు రూ.80 వేలు ఖర్చయిందని వైద్యుల బృందం చెప్పింది. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, ఇన్సైట్ ఔట్రిచ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వీటిని సమకూర్చినట్లు ఉస్మానియా సూపరింటిండెంట్ సి.జి.రఘురామ్ తెలిపారు. కాగా, వీరితో పాటు కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది పురుగుల మందు సేవించిన సావిత్రి (32; కడప జిల్లా జమ్మలమడుగు)కి కూడా శస్త్రచికిత్స చేసినట్లు చెప్పారు. -
'తొలిసారి నాన్న కళ్లలో కన్నీళ్లు చూశా.. '
ముంబై: హిందీ చిత్రం కూలీ ప్రమాద ఘటన తనకు పునర్జన్మ వంటిదని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అన్నారు. 33 ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రమాదం నుంచి తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. కూలీ ప్రమాద ఘటన వివరాలను 72 ఏళ్ల అమితాబ్ ట్విట్టర్లో తెలియజేశారు. ఆస్పత్రి నుంచి ఇంటి వచ్చాక తన తండ్రి హరివంశ రాయ్ బచ్చన్ కన్నీపర్యంతమయ్యారని గుర్తు చేసుకున్నారు. తండ్రి కళ్లలో తాను కన్నీళ్లు చూడటం అదే తొలిసారి అమితాబ్ ట్వీట్ చేశారు. తండ్రి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోను అమితాబ్ పోస్ట్ చేశారు. 1982 ఆగస్టు 2న బెంగళూరులో కూలీ షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ఆగస్టుల 2 తనకు పునర్జన్మ వంటిదని అమితాబ్ ట్వీట్ చేశారు. -
మనసున్న మనస్విని...
* అవయవదానం చేసిన ఎనిమిదేళ్ల చిన్నారి * మరణిస్తూ మరో నలుగురికి పునర్జన్మ హైదరాబాద్: మరణాన్ని ఆహ్వానిస్తూ మరో నలుగురికి పునర్జన్మనిచ్చింది ఓ చిన్నారి... తన కళ్లు, కాలేయం, మూత్రపిండాలు, గుండె రక్త నాళాలతో పాటు మొత్తం శరీరాన్ని దానం చేసి పిన్న వయసులోని పెద్ద మనసు చూపింది ఎనిమిదేళ్ల మనస్విని. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన గంగిశెట్టి గోపీ నాథ్, రూప దంపతుల కుమార్తె మనస్విని. గత బుధవారం గోదావరి పుష్కరాల కోసం గోపీనాథ్ కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా పోచంపాడుకు కారులో వెళ్లారు. అక్కడ గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి తిరిగి వస్తుండగా డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోంపేట వద్ద ప్రమాదవశాత్తు వీరి కారు ముందున్న లారీని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో గోపీనాథ్, ఆయన బావమరిది రాజేశ్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రూప, మనస్వినిలను స్థానికులు చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మనస్వినిని అదేరోజు జూబ్లిహిల్స్ అపోలోకు తరలించారు. రెండు రోజుల పాటు వైద్యసేవలు అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బాలిక అప్పటికే బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని బంధువులకు తెలుపగా, వారు బాలిక అవయవాలను దానం చేయడానికి ముందుకువచ్చారు. ఈ మేరకు జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. అపోలో వైద్యులు శనివారం ఉదయం మనస్విని శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, కళ్లు, గుండె కవాటాలను సేకరించి అక్కడే చికిత్స పొందుతున్న మరో నలుగురు బాధితులకు అమర్చారు. మనస్విని మృతదేహాన్ని గాంధీ వైద్యకళాశాలకు అప్పగించారు.