
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు టైటిల్ ను కూడా కన్ఫామ్ చేయలేదు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు కాన్సెప్ట్ టీజర్ ను రిలీజ్ చేసి సరిపెట్టారు. కొద్ది రోజులుగా దసరా సందర్భంగా చిత్ర టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారన్న ప్రచారం జరిగింది.
కానీ తాజాగా పవన్ అభిమానులకు నిరాశ తప్పదన్న టాక్ వినిపిస్తోంది. దసరా రోజు పవన్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇచ్చే సూచనలు కనిపించటం లేదు. ఇంత వరకు అలాంటి ఎనౌన్స్ మెంట్ ఏది.. చిత్రయూనిట్ నుంచి రాలేదు. దీంతో పవన్ అభిమానులు డీలా అయ్యారు. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూల్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటీమణులు ఖుష్బూ, ఇంద్రజలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.