సినిమా పరిశ్రమ లేకపోతే చానల్స్ లేవు : దాసరి | dasari narayana rao audio release ame atadaite movie | Sakshi
Sakshi News home page

సినిమా పరిశ్రమ లేకపోతే చానల్స్ లేవు : దాసరి

Published Mon, Oct 17 2016 10:57 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

సినిమా పరిశ్రమ లేకపోతే చానల్స్ లేవు : దాసరి

సినిమా పరిశ్రమ లేకపోతే చానల్స్ లేవు : దాసరి

 ‘‘తెలుగులో తక్కువ బడ్జెట్‌లో మంచి సినిమాలు తీస్తున్నారు. అవి విడుదలయ్యాయని జనాలకు తెలిసే లోపు థియేటర్స్ కొరత వల్ల రెండు మూడు రోజులకే తీసేస్తున్నారు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. క్లాసికల్ డ్యాన్సర్ మనీష్, చిరాశ్రీ జంటగా కె. సూర్యనారాయణ దర్శకత్వంలో శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఎం. మారుతీ ప్రసాద్, ఎన్. రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘ఆమె.. అతడైతే’. యశోకృష్ణ స్వరపరచిన పాటల సీడీని దాసరి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘‘చిన్న చిత్రాలను టీవీల్లో చూడ్డానికి కూడా అవకాశం లేదు. కారణం, వాటి  శాటిలైట్ హక్కులు కొనరు.
 
 వ్యాపారం కాబట్టి పెద్దవారి చిత్రాలు మాత్రమే కొంటారు. కానీ, సినిమా కార్యక్రమాలు ఏవి జరిగినా న్యూస్ కావాలి వాళ్లకి. ఏదో రకంగా చానల్స్‌కి ఇండస్ట్రీ ఉపయోగపడుతోంది. ఇండస్ట్రీ లేకుంటే చానల్స్ లేవు. ఇటువంటి సినిమాలను ప్రమోట్ చేయాలనే ఆలోచన టీవీ యాజమాన్యాలకు లేకపోవడం దురదృష్టకరం. అందుకే చిన్న సినిమా ఎవరన్నా తీస్తున్నారంటే భయమేస్తోంది.
 
 బడ్జెట్ ఎంత అయితే రిలీజ్‌కు కూడా అంతే ఖర్చు పెట్టాల్సి వస్తోంది. నాకు తెలిసి ‘బాహుబలి’ చిత్రం పబ్లిసిటీ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు’’ అన్నారు. ‘‘గ్రామీణ నేపథ్యం ఉన్న ఓ కుర్రాడు తెలుగు మీడియంలో డిగ్రీ సాధిస్తాడు. కొడుకు కలెక్టర్ కావాలనే తండ్రి ఆశయాన్ని ఎలా నెరవేర్చాడన్నదే కథాంశం’’ అని దర్శకుడు చెప్పారు. సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఉత్తేజ్, సుద్దాల అశోక్‌తేజ పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement