ఒకే రోజు.. డజనుకు పైగా రిలీజ్‌లు | December 15th releasing movies list | Sakshi
Sakshi News home page

Dec 12 2017 11:01 AM | Updated on Sep 15 2019 12:38 PM

December 15th releasing movies list - Sakshi

డిసెంబర్ చివరి వారం నుంచి మీడియం రేంజ్ హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా రిలీజ్ లకు రెడీ అవుతుండటంతో చిన్న సినిమాలు వరుస రిలీజ్‌లకు క్యూ కడుతున్నాయి. గత మూడు నాలుగు వారాలుగా ప్రతీ వారం ఆరడజనుకు తగ్గకుండా తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం ఆ సందడి మరింత పెరగనుంది.

ఈ శుక్రవారం (15-12-2017) ఏకంగా డజనుకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. బుల్లితెర యాంకర్ జయతి స్వయంగా నిర్మిస్తూ నటించిన ‘లచ్చి’, మరో యాంకర్ రవి హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన ‘ఇది మా ప్రేమకథ’తో పాటు ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘సీత రాముని కోసం’, కుటుంబ కథా చిత్రం, మామ ఓ చందమామ, ప్రేమ పందెం, తొలి పరిచయం, ఉందా లేదా, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ వంటి తెలుగు సినిమాలతో పాటు విక్రమ్, సమంతలు జంటగా తెరకెక్కి తమిళ నాట నిరాశపరిచిన 10 తెలుగు వర్షన్ కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల  ముందుకు రానుంది. 

అంతేకాదు గురువారం కూడా రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్ట్రయిట్ తెలుగు సినిమాగా తెరకెక్కిన కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ తో పాటు సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన డబ్బింగ్ సినిమా ప్రాజెక్ట్ జెడ్ కూడా గురువారం రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు మరో దృశ్యం, పడిపోయా నీ మాయలో సినిమాలు కూడా శుక్రవారమే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement