సిద్దాపురాన్ని ఫైనల్ చేశాం | decided to adopt siddapuram village, tweets mahesh babu | Sakshi
Sakshi News home page

సిద్దాపురాన్ని ఫైనల్ చేశాం

Published Mon, Sep 28 2015 12:25 PM | Last Updated on Thu, Jul 25 2019 5:39 PM

సిద్దాపురాన్ని ఫైనల్ చేశాం - Sakshi

సిద్దాపురాన్ని ఫైనల్ చేశాం

మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు హీరో మహేశ్ బాబు ప్రకటించారు. తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావుతో బాగా ఆలోచించిన తర్వాత.. ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నానన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

రాబోయే కాలంలో నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా వెళ్లాలని చూస్తున్నట్లు మహేశ్ చెప్పారు. ఇంతకుముందు తన తండ్రి సొంత ఊరైన బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేశ్.. తాజాగా సిద్దాపురాన్ని కూడా దత్తత తీసుకుంటున్నాడు. అయితే, దీనికి సంతోషించిన మంత్రి కేటీఆర్.. తనను మాత్రం సర్ అని పిలవొద్దని మహేశ్ను కోరారు. తనకు ఇంకా 'నైట్హుడ్' రాలేదని, అందువల్ల కేటీఆర్ అంటే చాలని సరదాగా చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement