లేడీ సూపర్‌స్టార్
దీపిక పదుకొనె పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆమె పాపులారిటీ పెరుగుతోంది. 2013లోనే దీపికను 100 కోట్ల హీరోయిన్‌గా అభివర్ణించారు. నిన్న మొన్నటిదాకా బాక్సాఫీస్ గోల్డ్ అన్నారు. ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. దీపిక పతాక శీర్షికల్లో అదరగొడుతోంది. ఈ మధ్యనే ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీనటుల జాబితాను ప్రకటించింది.
2015కు సంబంధించిన ఆ లిస్ట్‌లో దీపిక పేరు చోటుచేసుకుంది. టాప్ టెన్ వరల్డ్ హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ లిస్ట్‌లో నిలిచి ఈ సుందరి సంచలనం సృష్టించింది. దీంతో హాలీవుడ్ వీధుల్లో ఇప్పుడు దీపిక నామస్మరణ వినపడుతోంది. ఒకప్పటి బ్యాడ్మింటన్ ప్లేయర్ బాలీవుడ్ నం1 హీరోయిన్‌గా ఎలా రాణించగలుగుతోంది? బీ టౌన్లో చక్రం తిప్పే స్థాయికి ఎలా ఎదిగింది? నిత్యం ఎఫైర్లతో సహవాసం చేసే హీరోయిన్ తిరుగులేని కథానాయికగా ఎలా నిలబడింది? ఈ విశేషాలు....
స్టార్ స్టార్ సూపర్ స్టార్... సాక్షి టీవీలో... రాత్రి 7.30ని.కు