రజనీ ఇంటి నుంచే లంచ్ | Deepika Padukone Lunch box in Rajinikanth home | Sakshi
Sakshi News home page

రజనీ ఇంటి నుంచే లంచ్

Published Tue, Oct 7 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM

రజనీ ఇంటి నుంచే లంచ్

రజనీ ఇంటి నుంచే లంచ్

చెన్నై కొస్తే నాకు రజనీ ఇంటి నుంచే లంచ్ వస్తుందని గొప్పగా చెప్పుకుంటోంది బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే. వరుస విజయాలతో సహ హీరోయిన్లకు దడ పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన తాజా చిత్రం హ్యాపీ న్యూ ఇయర్‌కు ప్రచారంలో భాగంగా చెన్నై కొచ్చారు. ఈ సందర్భంగా కోచ్చడయాన్ చిత్రం తరువాత తమిళంలో నటించకపోవడానికి కారణం ఏమిటన్న విలేకర్ల ప్రశ్నకు బదులిస్తూ ఏ భాషా చిత్రంలోనయినా నటించడానికి తాను రెడీ అంది. హీరో ఎవరన్నది కూడా చూడనని స్పష్టం చేసింది. తన పాత్రకు ప్రాముఖ్యత ఉందా? అన్న విషయం గురించే ఆలోచిస్తానని చెప్పింది. రజనీకాంత్ సరసన కోచ్చడయాన్ చిత్రంలో నటించడం మధురమయిన అనుభవంగా పేర్కొంది.
 
 అదేవిధంగా దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ఆశగా ఉందని చెప్పింది. ఇంతకు ముందొకసారి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చిందని అయితే అనివార్య కారణాల వల్ల అది జరగలేదని తెలిపింది. మరో విషయం ఏమిటంటే తానెప్పుడు చెన్నైకి వచ్చినా రజనీకాంత్ కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్యలతో మాట్లాడతానని చెప్పింది. వారు తన కుటుంబ సభ్యుల్లా కలిసిపోయూరని చెప్పింది. ఐశ్వర్య గానీ, సౌందర్య గానీ ముంబాయి వస్తే తనను కలుసుకుంటారని చెప్పింది. తానెప్పుడు చెన్నై వచ్చినా రజనీ ఇంటి నుంచే లంచ్ బాక్స్ వస్తుందని దీపిక వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement