కత్రినాపై సెటైర్ | deepika padukone Setires on katrina kaif | Sakshi
Sakshi News home page

కత్రినాపై సెటైర్

Published Sun, Jul 6 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

కత్రినాపై సెటైర్

కత్రినాపై సెటైర్

 ‘‘సినిమా పరిశ్రమలో ఏదీ శాశ్వతం కాదు. ఇవాళ స్టార్ అనిపించుకున్నవాళ్లు ఎప్పటికీ అదే హోదాలో ఉంటారనిగ్యారంటీ లేదు’’ అని దీపికా పదుకొనె అన్నారు. వృత్తిపరంగా తనకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్న కత్రినాకైఫ్ గురించి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడారు దీపికా. కత్రినా జెట్ వేగంతో దూసుకెళ్లడం మీకెలా అనిపిస్తోంది? అనే ప్రశ్న దీపికా ముందుంచితే - ‘‘కత్రినా గొప్ప అందగత్తె మాత్రమే కాదు ప్రతిభావంతురాలు కూడా.
 
 తనిప్పుడు మంచి హోదాలో ఉంది. అందుకు పూర్తి అర్హురాలు. కానీ, నేనెవరి స్థాయినీ సీరియస్‌గా తీసుకోను. ఈ ఏడాది ఒకరి హవా సాగితే.. వచ్చే ఏడాది వేరే తారది ఉంటుంది. సో.. ఇవాళ కత్రినా దూసుకెళుతోందని నేను కంగారుపడను’’ అన్నారు. ఈ మాటలు విన్నవాళ్లు ఓవైపు కత్రినాని పొగుడుతూనే మరోవైపు ఆమె దూకుడు ఎన్నాళ్లు? అని సెటైరికల్‌గా దీపికా చెప్పిందని, ఎంతైనా ఈవిడగారు ‘బ్యూటీ విత్ బ్రైన్’ అని అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement