మహేశ్‌బాబుకు థాంక్స్‌ చెప్పిన దీపిక! | Deepika Padukone thanked Mahesh Babu | Sakshi
Sakshi News home page

మహేశ్‌బాబుకు థాంక్స్‌ చెప్పిన దీపిక!

Published Wed, Dec 2 2015 6:48 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

మహేశ్‌బాబుకు థాంక్స్‌ చెప్పిన దీపిక!

మహేశ్‌బాబుకు థాంక్స్‌ చెప్పిన దీపిక!

బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనే టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు థాంక్స్ చెప్పింది. తన తాజా సినిమా 'తమాషా' హిట్టవ్వడంతో ఆనందంగా ఉన్న దీపిక.. మహేశ్‌బాబుతో కలిసి నటించేందుకు గతంలో ఆసక్తి కనబర్చింది. తెలుగు హీరోల్లో తన ఫేవరెట్‌ స్టార్ మహేశ్‌బాబు అని ఆమె ఓసారి చెప్పింది కూడా. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పేపర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మహేశ్‌బాబు ' ఒకప్పుడు నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ హీరోయిన్‌ శ్రీదేవి. ఇప్పుడు మాత్రం దీపికా పదుకొనే. ఆమె అద్భుతమైన నటి.

'పీకూ'లో ఆమె నటన చూసి ముగ్ధుడిన్నయాను. ఆమె చాలా అందంగా ఉంటుంది. దానికితోడు అలాంటి నటన కూడా ప్రదర్శించడం చాలా గొప్ప విషయం' అని చెప్పారు. దీంతో మహేశ్‌ ప్రశంసలతో కదిలిపోయిన దీపిక ఆయనకు ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపింది. 'తమాషా' చిత్రంలో దీపిక అద్భుతమైన నటనను ప్రశంసిస్తూ ఆమెకు వ్యక్తిగతంలో మహేశ్‌ కాల్‌ చేసినట్టు తెలిసింది. దీపిక ప్రస్తుతం సంజయ్‌లీలా భన్సాలీ 'బాజీరావు మస్తానీ'లో నటిస్తుండగా.. మహేశ్‌బాబు 'బ్రహ్మోత్సవం' వచ్చే ఏడాది ప్రేక్షకులను పలుకరించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement