దీపిక పారితోషికం ఎంతో తెలుసా? | Deepika Padukone will charge THIS MUCH for a film now on | Sakshi
Sakshi News home page

దీపిక పారితోషికం ఎంతో తెలుసా?

Published Wed, Jan 6 2016 1:42 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

దీపిక పారితోషికం ఎంతో తెలుసా?

దీపిక పారితోషికం ఎంతో తెలుసా?

ఈ నెల 5వ తేదీతో 30వ వసంతంలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ అందాల సుందరి దీపికా పదుకొణ్‌. ఆమె జన్మదినం సందర్భంగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ పరిశ్రమ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అది వరుస విజయాలతో జోరుమీదున్న దీపిక పారితోషికం గురించి. 2015 వరకు ఈ సుందరి సినిమాకు రూ. 10 కోట్ల చొప్పున  తీసుకునేదట. కానీ 'బాజీరావు మస్తానీ' సినిమా ఊహించనంత విజయం సాధించడంతో ఈమె పారితోషికాన్ని అమాంతం పెంచేసింది. ఇప్పుడు సినిమాకు రూ. 15 కోట్లు అడుగుతున్నదని సమాచారం. ప్రస్తుతం దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అతికొద్ది మంది హీరోయిన్లలో ఒకరిగా దీపిక నిలిచింది.

2015లో దీపిక ప్రేక్షక జనం నుంచే కాదు సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలందుకుంది. గత ఏడాది షుజిత్‌ సర్కార్ తెరకెక్కించిన 'పీకూ' సినిమాలో దీపిక తన అభినయంతో అదరగొట్టింది.  చక్కని విజయం సాధించిన 'పీకూ'లో దీపిక తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక మాజీ బాయ్‌ఫ్రెండ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి నటించిన 'తమాషా' సినిమా కూడా దీపికకు మంచి పేరునే తీసుకొచ్చింది. ఏడాది చివర్లో వచ్చిన 'బాజీరావు మస్తానీ'లో మస్తానీగా ఈ సొట్టబుగ్గల చిన్నది అభిమానులను కట్టిపడేసింది. ఈ సినిమాలో దీపిక చూపిన అభినయ కౌశల్యంపై విమర్శకుల నుంచీ ప్రశంసల వర్షం కురిసింది. 'బాజీరావు మస్తానీ' విజయంతో నిర్మాతలకు దీపిక మరింత ప్రియంగా మారింది.. ఆమె పారితోషికం కళ్లు చేదిరేస్థాయికి పెరిగిందంటున్నారు బాలీవుడ్ జనాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement