ఫిలింఫేర్‌లో దుమ్మురేపిన 'బాజీరావు'! | Filmfare 2016: Ranveer Singh, 'Bajirao Mastani' get top honours, Deepika wins Best Actress | Sakshi
Sakshi News home page

ఫిలింఫేర్‌లో దుమ్మురేపిన 'బాజీరావు'!

Published Sat, Jan 16 2016 5:25 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 PM

ఫిలింఫేర్‌లో దుమ్మురేపిన 'బాజీరావు'!

ఫిలింఫేర్‌లో దుమ్మురేపిన 'బాజీరావు'!

ముంబై: ఊహించినట్టే సంజయ్‌లీలా భన్సాలీ చారిత్రక ప్రేమకథ 'బాజీరావు మస్తానీ' అవార్డుల విషయంలో దుమ్మురేపుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ పురస్కారాల్లో ఈ సినిమా పంట పండింది. శుక్రవారం ముంబైలోని సర్దార్ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో అత్యధిక అవార్డులతో భన్సాలీ తన సత్తా చాట్టాడు. 'బాజీరావు మస్తానీ' ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు సహా మొత్తం తొమ్మిది పురస్కారాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత స్థానంలో షుజిత్ సర్కార్ 'పీకూ' సినిమా నిలిచింది. ఉత్తమ కథాకథనాలతో విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ సినిమా ఐదు అవార్డులతో తన ప్రతిష్ట నిలబెట్టుకుంది.

  'పీకూ' సినిమాలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న దీపికా పదుకొణ్‌కు ఉత్తమ నటి అవార్డు లభించింది. మరాఠా యోధుడు 'బాజీరావు' పాత్రను సమర్థంగా పోషించి మెప్పించినందుకు ఆమె చెలికాడు రణ్‌వీర్‌ సింగ్‌కు ఉత్తమ నటుడు పురస్కారం దక్కింది. 'బాజీరావు మస్తానీ'లోనూ దీపిక అద్భుతమైన ప్రతిభ కనబర్చినప్పటికీ.. 'పీకూ'లోని ఆమె అభినయానికి న్యాయనిర్ణేతలు ఓటువేశారు. 'పీకూ' సినిమాలో చివరిసారిగా కనిపించిన అలనాటి నటి మౌషుమి చటర్జీకి జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది.

 

61వ బ్రిటానియా ఫిలింఫేర్ అవార్డ్‌-2015 విజేతలు వీరే

  • ఉత్తమ నటుడు: రణ్‌వీర్‌ సింగ్ (బాజీరావ్ మస్తానీ)
  • ఉత్తమ నటి: దీపికా పడుకొనే (పీకూ)
  • ఉత్తమ చిత్రం - బాజీరావ్ మస్తానీ
  • ఉత్తమ దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ (బాజీరావ్ మస్తానీ)
  • ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు - నీరజ్ ఘాయ్‌వాన్‌ (మసాన్‌)
  • ఉత్తమ హీరోయిన్‌ (తొలిచిత్రం) - భూమి పెడ్నెకర్‌ (దమ్ లాగాకే హైస్సా )
  • ఉత్తమ హీరో (తొలిచిత్రం) - సూరజ్ పంచోలి ('హీరో')
  • విమర్శకులు మెచ్చిన ఉత్తమ చిత్రం - పీకూ
  • క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటుడు - అమితాబ్ బచ్చన్ (పీకూ)
  • క్రిటిక్స్ ఛాయిస్ ఉత్తమ నటి - కంగనా రానౌత్‌ (తను వెడ్స్ మను రిటర్న్స్)
  • సహాయ పాత్రలో ఉత్తమ నటి: ప్రియాంకా చోప్రా (బాజీరావ్ మస్తానీ')
  • సహాయ పాత్రలో ఉత్తమ నటి: అనిల్ కపూర్ (దిల్ దడక్‌నే దో)
  • జీవితకాల సాఫల్య పురస్కారం - మౌషుమి ఛటర్జీ
  • ఉత్తమ కాస్ట్యూమ్ - అంజు మోడీ, గరిష్ట బసు (బాజీరావ్ మస్తానీ)
  • ఉత్తమ సౌండ్ డిజైన్ - షాజిత్‌ కోయెరీ (తల్వార్)
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - సుజీత్‌ సావంత్, శ్రీరామ్ అయ్యంగార్, సలోని ధాత్రక్‌ (బాజీరావ్ మస్తానీ)
  • ఉత్తమ నృత్యదర్శకుడు - పండిట్ బిర్జు మహరాజ్ ('బాజీరావ్ మస్తానీ'లో మోహె రంగ్ దో లాల్‌ పాటకు)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ - మను ఆనంద్ ('దమ్ లాగాకే హైస్సా')
  • ఉత్తమ యాక్షన్ - నకిలీ కౌశల్ (బాజీరావ్ మస్తానీ)
  • ఆర్డీ బర్మన్ అవార్డు - అర్మాన్ మాలిక్
  • ఉత్తమ నేపథ్య సంగీతం - అనుపమ్ రాయ్ (పీకూ)
  • ఉత్తమ వీఎఫ్‌ఎక్స్ - ప్రాణ స్టూడియో (బొంబే వెల్వెట్‌)
  • ఉత్తమ నేపథ్య గాయని - శ్రేయా ఘోషాల్ ('బాజీరావ్ మస్తాని'లో దివానీ మస్తానీ పాట)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు - అరిజిత్ సింగ్ ('రాయ్'లో సూరజ్ డుబా హై పాట)
  • ఉత్తమ పాట - ఇర్షాద్ కామిల్ ('తమాషా'లో అగర్ తుమ్ సాత్ హో)
  • ఉత్తమ సంగీతం - అంకిత్ తివారీ, మీట్ బ్రదర్స్ అంజన్‌, అమాల్ మల్లిక్ (రాయ్‌)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే - జుహీ చతుర్వేది (పీకూ)
  • ఉత్తమ ఎడిటింగ్ - శ్రీకర్ ప్రసాద్ (తల్వార్)
  • ఉత్తమ కథ - విజయేంద్ర ప్రసాద్ (బజరంరీ భాయ్‌జాన్‌)
  • ఉత్తమ సంభాషణలు - హిమాన్షు శర్మ (తను వెడ్స్‌ మను రిటర్న్స్)
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement