అమితాబ్ కన్నా ఆమె పారితోషికమే ఎక్కువట..! | deepika padukone paid higher than amithab | Sakshi
Sakshi News home page

అమితాబ్ కన్నా ఆమె పారితోషికమే ఎక్కువట..!

Published Wed, Oct 26 2016 2:13 PM | Last Updated on Mon, May 28 2018 4:05 PM

అమితాబ్ కన్నా ఆమె పారితోషికమే ఎక్కువట..! - Sakshi

అమితాబ్ కన్నా ఆమె పారితోషికమే ఎక్కువట..!

ఈ జనరేషన్ హీరోలకు కూడా గట్టి పోటి ఇస్తూ బాలీవుడ్లో మెగాస్టార్ ఇమేజ్ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్న సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్. అంతర్జాతీయ స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ గ్రేట్ యాక్టర్, తను నటించిన ఓ సినిమాకు సంబందించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అమితాబ్ కు మరోసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందించిన పీకూ సినిమా పారితోషికంపై అమితాబ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి.

భారతీయ సినీ పరిశ్రమ మేల్ డామినేటెడ్ అన్న టాక్ బలంగా ఉంది. ముఖ్యంగా ఎంతటి గొప్పనటి అయినా.. సరే ఆ సినిమా హీరో కన్నా తక్కువ పారితోషికం తీసుకుంటుందన్న భావన ఉంది. అయితే పీకూ సినిమా విషయంలో అమితాబ్ రెమ్యూనరేషన్ కన్నా ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన దీపికా పదుకొనే రెమ్యూనరేషనే ఎక్కువట. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా ప్రకటించాడు. పీకూ సినిమాలో అమితాబ్ పాత్ర కన్నా దీపిక పాత్ర పెద్దది కావటంతో పాటు దీపికకు హాలీవుడ్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటంతో భారీ రెమ్యూరేషన్ అందుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement