దీపికా పదుకోన్
యాక్టర్ కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు? అని ప్రతి యాక్టర్‌కు ఏదో సందర్భంలో ఎదురుపడే ప్రశ్న. డాక్టర్, పైలెట్, ఇంజినీర్ అని ఏదో ఒకటి చెబుతుంటారు. కానీ దీపికా పదుకోన్ మాత్రం ఖచ్చితంగా కవయిత్రి అయ్యి ఉండేవారు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నాం అనుకుంటున్నారా? దీపికా పదుకోన్ ఏడో తరగతిలో రాసిన ‘ఐ యామ్ – ది చైల్డ్ విత్ లవ్ అండ్ కేర్’ అనే కవితను చదివితే ఎవరైనా అలానే అంటారు. ఎప్పుడో రాసుకున్న ఈ కవితను ఇప్పుడు దీపికా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
‘‘లైఫ్ ఏదో ఒక రోజు ఎండ్ అవుతుంది అని మనందరికీ తెలుసు. అలా అని అది మనం అనుకున్న గోల్స్‌ను రీచ్ కావడాన్ని ఆపకూడదు. మనం కలలు కంటూనే ఉండాలి. మనం కష్టపడుతూనే ఉండాలి, మన బెస్ట్‌నే ఇస్తూనే ఉండాలి, అలాగే.. వెరీ బెస్ట్‌ని ఆశించాలి’’ అనే సారాంశంతో సాగే ఈ పోయమ్‌ను ఏడో తరగతిలోనే అంత మెచ్యూరిటీతో రాశారంటే.. ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే కవయిత్రిగా దీపికా రాణించేవారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment