ఆ నటికి ఢిల్లీ అంటే ఎందుకంత స్పెషలో తెలుసా? | Delhi is very special for me, says Anushka Sharma | Sakshi
Sakshi News home page

ఆ నటికి ఢిల్లీ అంటే ఎందుకంత స్పెషలో తెలుసా?

Published Sun, Dec 25 2016 12:50 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఆ నటికి ఢిల్లీ అంటే ఎందుకంత స్పెషలో తెలుసా? - Sakshi

ఆ నటికి ఢిల్లీ అంటే ఎందుకంత స్పెషలో తెలుసా?

ముంబై: బెంగళూరులోనే ఎక్కువ రోజులు గడిపినా తనకు ఢిల్లీ నగరంతేనే ప్రత్యేక అనుబంధం ఉందని బాలీవుడ్ నటి అనుష్కశర్మ అంటోంది. ఈ నగరం అంటే తనకెంతో ప్రత్యేకమని, ఇక్కడ షూటింగ్ జరుపుకున్న తన మూవీలు సక్సెస్ సాధించాయని చెప్పింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఈ నెలలో ఢిల్లీలో నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు తెలిపింది. 'మొదట మోడలింగ్ కోసం ముంబైకి మకాం మార్చాను. ఆపై అనుకున్నట్లుగానే బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడమే కాదు.. తొలి మూవీ 'రబ్ నే బనా ది జోడీ'లో బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్‌ సరసన నటించడంపై ఎంతో హ్యాపీగా ఉన్నాను' అని అనుష్క మరికొన్ని విషయాలను జాతీయ మీడియాతో పంచుకుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ఢిల్లీలో షూటింగ్ జరుపుకున్న తన మూవీలు పీకే, 'ఎన్‌హెచ్ 10' లు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి.. అందుకే ఈ సిటీ నాకు వెరీ స్పెషల్ అని అనుష్క చెప్పుకొచ్చింది. బ్యాండ్ జాజా బరాత్(2010) మూవీ వెస్డ్ ఢిల్లీ యువతిగా కనిపించిన తనను నిజంగానే నేను ఢిల్లీ లోకల్ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉందని అంటోంది. ఇంకో విషయం ఏంటంటే.. భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీది ఢిల్లీ కావడం గమనార్హం. గత కొంతకాలం నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కోహ్లీ ఈ ఏడాది తన బర్త్‌డేను మొదట అనుష్కతో సెలబ్రేట్ చేసుకుని, ఆ తర్వాత టీమిండియాతో కలిసి జరుపుకున్నాడు. అందుకే అనుష్కశర్మకు ఢిల్లీ ఎంతో ప్రత్యేకమని వదంతులు ప్రచారం అవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement