రజనీ మూవీలో లేడీ గ్యాంగ్స్టర్ ఎవరు? | Dhansikaa plays gangster in 'Kabali' | Sakshi
Sakshi News home page

రజనీ మూవీలో లేడీ గ్యాంగ్స్టర్ ఎవరు?

Published Sat, Mar 5 2016 5:43 PM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

రజనీ మూవీలో లేడీ గ్యాంగ్స్టర్  ఎవరు?

రజనీ మూవీలో లేడీ గ్యాంగ్స్టర్ ఎవరు?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భిన్నమైన కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ‘కబాలి’ సినిమాలో తమిళనటి ధన్సిక క్యారెక్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రజనీకాంత్ కూతురుగా నటిస్తున్న ధన్సిక గ్యాంగ్స్టర్ పాత్రను పోషిస్తోందట. కూతురే ఆయన పాలిట విలన్‌గా, లేడీ డాన్గా అవతరిస్తుందట. తండ్రిని ఎదిరించే కూతురుగా, అతడితో విభేదిస్తూ.. సొంతముఠా ఏర్పాటుచేసుకుని గ్యాంగ్‌స్టర్‌గా అవతరిస్తుందని పేర్కొంది. సొంత తండ్రి వల్ల తీవ్రమైన సమస్యలకు గురైన పాత్రలో ఆమె ఒదిగిపోయిందని తెలిపారు. ఇంతవరకు ఆమె చేసిన పాత్రల కంటే ఇది చాలా  భిన్నమైనదనీ... డిఫరెంట్ లుక్‌లో అలరిస్తుందన్నారు. దీనికోసం ఆమె చాలా  కష్టపడి తన బాడీని  పాత్రకు అనుగుణంగా మలుచుకుందని పేర్కొన్నారు.

లింగ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రజినీ ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా కథ విషయానికి వస్తే రజనీకాంత్ ఒకప్పుడు గ్యాంగ్‌స్టర్‌గా ఉండేవాడు. తదనంతర పరిణామాలతో ఆ పనులకు స్వస్తి పలికి కుటుంబానికి  చేరువవుతాడు. అయితే ప్రత్యర్థులు ఆయనపై పగతో రజనీ కూతురు (ధన్సిక)ను కిడ్నాప్ చేస్తారు. దీంతో మళ్లీ రజనీ మాఫియా లీడర్‌గా అవతరించడం.. ఇలా  ఇలా ట్విస్టుల మీద  ట్విస్టులతో సాగుతుందీ కథనం.

రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటిస్తోంది. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ మూవీలో దినేష్, కలైశరన్, రిత్విక తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సీనిమా.. వేసవి సెలవుల సమయంలో థియేటర్లను పలకరించనుంది. చూడ్డానికి హీరోయిన్ అమలాపాల్ లా  కనిపించే ఈ భామ తన హాట్ లుక్స్ తో తమిళ ప్రేక్షకులను  బాగానే ఆకట్టుకుంది..  మరి ఈ సినిమాలోని సీరియస్ గెటప్‌లో ఎంతవరకు అలరించనుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement