రజనీకాంతా.. మజాకా! | Rajinikanth fans show his style in gif files | Sakshi
Sakshi News home page

రజనీకాంతా.. మజాకా!

Published Wed, Jul 27 2016 8:44 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

Rajinikanth fans show his style in gif files

స్టైల్ అంటే రజనీ.. రజనీ అంటే స్టైల్ అంటారు. చేతుల్లోని సిగరెట్ను పైకి విసిరి నోట్లోకి తెచ్చుకున్నా.. నడకలోనే తనదైన వైవిధ్యం కనబర్చినా, అవతలివాళ్లకు రెండు వేళ్లతో సెల్యూట్ చేసినా.. ప్రతి మూమెంట్లోను రజనీ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా విడుదలైన కబాలి సినిమాలో ఈ స్టైల్ కాస్త తగ్గిందన్న అసంతృప్తి అభిమానులకు మిగిలిపోయింది. కానీ, కండక్టర్గా జీవితం ఆరంభించి.. దేశవ్యాప్తంగా, ఇంకా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న రజనీకాంత్ స్టైల్ ఈ సినిమాలో కూడా ఏమాత్రం తగ్గలేదని ఆయన వీరాభిమానులు అంటున్నారు. కబాలి సినిమా మొదటి మూడురోజుల్లోనే 200 కోట్లు సాధించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో రజనీ స్టైల్ను చూపించే కొన్ని ‘జిఫ్’లను ఆయన వీరాభిమానులు రూపొందించారు. ఎవరూ ఏమాత్రం అనుకరించలేని రజనీ స్టైల్ను ఈ జిఫ్లు చూపిస్తాయి. అసలు రజనీ అంటేనే స్టైల్ సిగ్నేచర్ అని ఎందుకంటారో వీటిని చూస్తే తెలుస‍్తుంది. ఈ జిఫ్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా వ్యాపిస్తున్నాయి. అలాంటివాటిలో కొన్నింటిని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement