కబాలి నెంబర్.. 8 లక్షలు! | Rajinikanth fan spends 8 lakhs for kabali number for his new car | Sakshi
Sakshi News home page

కబాలి నెంబర్.. 8 లక్షలు!

Published Mon, Jul 25 2016 2:51 PM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

కబాలి నెంబర్.. 8 లక్షలు! - Sakshi

కబాలి నెంబర్.. 8 లక్షలు!

ఎంత డివైడ్ టాక్ వచ్చినా అభిమానుల్లో మాత్రం కబాలి ఫీవర్ ఇంకా తగ్గలేదు. రజనీకాంత్ వీరాభిమాని ఒకరు తన కారు మీద శాశ్వతంగా కబాలి ఉండిపోవాలని అనుకున్నారు. అందుకోసం కొత్త ‘ఆడి’ కారు కొన్నారు. అయితే, ఆయన ఉండేది తమిళనాడులోని ఒక పట్టణంలో. అక్కడ రిజిస్ట్రేషన్ చేయిస్తే టీఎన్ అనే సిరీస్ వస్తుంది. కబాలి పేరుతో కారు నెంబర్ కావాలని కర్ణాటక వెళ్లారు. అక్కడ ఎటూ కేఏ సిరీస్ వస్తుంది. అందులో కేఏ8ఏఎల్1 అనే నెంబరు కావాలని ముందుగా బుకింగ్ చేసుకున్నారు. ఆ నెంబరు వేలానికి వచ్చింది. తమ హీరో కోసం ఎంతయినా ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్న సదరు అభిమాని.. ఏకంగా 8 లక్షలు పెట్టి ఆ నంబరు కొనుక్కున్నారట.

దాన్ని ఇంగ్లీషులో కేఏబీఏఎల్ఐ (కబాలి) అని వచ్చేలా రాయించుకున్నారు. పైన రజనీ బొమ్మ కూడా వేయించి, కబాలి అని మాత్రమే కనిపించేలా నంబర్ ప్లేటు వేసుకుని ఆయన తన ఆడి కారులో రాజసంగా తమిళనాడు వీధుల్లో తిరుగుతున్నారు. ఇది చూసిన తోటి అభిమానులు.. ముచ్చటపడి ఆ కారును వెనక నుంచి ఫొటో తీసి సోషల్ మీడియాలో మొత్తం విషయంతో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది వాట్సప్, ఫేస్బుక్లలో వైరల్గా వ్యాపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement