gif files
-
భారీ డీల్: ఫేస్బుక్ చేతికి ‘జిఫీ’
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలో వాటా కొనుగోలుతో వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మరో ప్రముఖ వెబ్‌సైట్‌ను తన సొంతం చేసుకోనుంది. యానిమేటెడ్ ఇమేజెస్ లేదా జిఫ్‌లు రూపొందించే పాపులర్ వెబ్సైట్ జిఫీని కొనుగోలు చేస్తున్నామని శుక్రవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్స్టాగ్రామ్ ఫోటో షేరింగ్ యాప్‌తో దీన్ని అనుసంధానం చేస్తున్నట్టు వెల్లడించింది. (గుడ్ న్యూస్: జియో అదిరిపోయే ప్లాన్) ఈ డీల్ వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ, దీని విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,035 కోట్లు).ఫేస్బుక్ యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటర్నెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన జిఫీ భాగం అవుతుంది. ఇకపై జిఐఎఫ్ లైబ్రరీ ఇన్స్టాగ్రామ్ , ఫేస్బుక్ యాజమాన్యంలోని ఇతర యాప్‌లలో విలీనం కానుంది. ట్విటర్, స్నాప్‌చాట్, బైట్ డాన్స్ టిక్‌టాక్ వంటి సామాజిక వేదికలతో గిఫీ ప్రస్తుత అనుసంధానాలు మారవు అని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎప్పటిలాగానే వైడర్ ఎకోసిస్టంలో జిపీ అందుబాటులో వుంటుందని జిఫి కూడా ప్రకటించింది. తాజా భాగస్వామ్యంతో గొప్ప కంటెంట్‌ను సృష్టించగలుగుతాని ఇన్స్టాగ్రామ్ ఉత్పత్తి ఉపాధ్యక్షుడు విశాల్ షా అన్నారు. (ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం) యాంటీట్రస్ట్ ఆందోళనలు, రెగ్యులేటర్ల పరిశీలన ఉన్న సమయంలో ఫేస్బుక్ ఈ డీల్‌ను వెల్లడించడం విశేషం. కాగా న్యూస్ సైట్ టెక్ క్రంచ్ ప్రకారం, 2015లో, గిఫీ ఒక ఫేస్బుక్ ఆఫర్‌ను తిరస్కరించి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అనుసంధానంతో స్వతంత్రగా కొనసాగాలని నిర్ణయించుకుంది. (ట్రంప్ : డబ్ల్యూహెచ్ఓకు నిధుల కోత?) -
ఆ ఫీచర్ తొలగించిన క్రేజీ యాప్స్
న్యూయార్క్: ప్రముఖ మేసేజింగ్ యాప్స్ ఇన్స్టాగ్రాం, స్నాప్‌చాట్‌లు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.యూజర్ల మనోభావాలను దెబ్బతీస్తున్నాయానే అంచనాలతో కీలక ఫీచర్‌ను తాత్కాలికంగా తొలగించేందుకు నిర్ణయించాయి. తద్వారా తమ సేవలు యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిపాయి. ఫోటోలు, వీడియోలు షేరింగ్ యాప్స్ ఇన్స్టాగ్రాం, స్నాప్చాట్లలో టెక్ట్స్ కు బదులుగా సందేశాన్ని తెలియజేసే జిఫ్ (జిఫ్ఫి) లు వివక్షను, జాత్యాంహకారాన్ని సూచించేవిగా ఉన్నందువల్ల వాటిని తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. వీటి వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందనీ, ఇటీవల తమ సర్వేలో తేలిందని వెల్లడించాయి. వీటీపై కొంతమందితో సర్వే నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు సంస్థలు తెలిపాయి. ఈ నిర్ణయంపై స్పందించిన వినియోగదారులు తమ వ్యక్తిగత వివరాల భద్రతకు తీసుకుంటున్న చర్యలు కూడా వివరిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. -
రజనీకాంతా.. మజాకా!
స్టైల్ అంటే రజనీ.. రజనీ అంటే స్టైల్ అంటారు. చేతుల్లోని సిగరెట్‌ను పైకి విసిరి నోట్లోకి తెచ్చుకున్నా.. నడకలోనే తనదైన వైవిధ్యం కనబర్చినా, అవతలివాళ్లకు రెండు వేళ్లతో సెల్యూట్ చేసినా.. ప్రతి మూమెంట్లోను రజనీ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా విడుదలైన కబాలి సినిమాలో ఈ స్టైల్ కాస్త తగ్గిందన్న అసంతృప్తి అభిమానులకు మిగిలిపోయింది. కానీ, కండక్టర్‌గా జీవితం ఆరంభించి.. దేశవ్యాప్తంగా, ఇంకా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న రజనీకాంత్ స్టైల్ ఈ సినిమాలో కూడా ఏమాత్రం తగ్గలేదని ఆయన వీరాభిమానులు అంటున్నారు. కబాలి సినిమా మొదటి మూడురోజుల్లోనే 200 కోట్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజనీ స్టైల్‌ను చూపించే కొన్ని ‘జిఫ్’లను ఆయన వీరాభిమానులు రూపొందించారు. ఎవరూ ఏమాత్రం అనుకరించలేని రజనీ స్టైల్‌ను ఈ జిఫ్‌లు చూపిస్తాయి. అసలు రజనీ అంటేనే స్టైల్ సిగ్నేచర్ అని ఎందుకంటారో వీటిని చూస్తే తెలుస్తుంది. ఈ జిఫ్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తున్నాయి. అలాంటివాటిలో కొన్నింటిని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం.. via GIPHY via GIPHY via GIPHY via GIPHY -
వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్..
లండన్: ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ను యాడ్ చేసుకుంది. మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌లో ఇకపై జిఫ్ ఇమేజ్ ఫైల్స్ కూడా ప్లే చేయవచ్చు. ఇది ఇప్పటికే ఐఫోన్లలో అందుబాటులోకి వచ్చినట్లు చెబుతున్నారు. గతంలో ఐఫోన్ మినహా ఇతర స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. అయితే దీనిపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పటిదాకా జిఫ్ ఫైల్స్‌ను వాట్సాప్ సపోర్ట్ చేయలేదు. ఇకపై దీన్ని కూడా ఆండ్రాయిడ్ యూజర్స్ షేర్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ ఇమేజ్ ఉండే జిఫ్ ఫైల్స్ కోసం సరికొత్తగా బీటా రిలీజ్ (వీ2.167.1)ను వాట్సాప్ అభివృద్ధి చేసినట్లు సమాచారం. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియరాలేదు. కాగా, వైబర్లో జిఫ్ ఫైల్స్ ను ప్లే చేసుకునే అవకాశం ఇప్పటికే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.