వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్..
లండన్: ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ను యాడ్ చేసుకుంది. మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్లో ఇకపై జిఫ్ ఇమేజ్ ఫైల్స్ కూడా ప్లే చేయవచ్చు. ఇది ఇప్పటికే ఐఫోన్లలో అందుబాటులోకి వచ్చినట్లు చెబుతున్నారు. గతంలో ఐఫోన్ మినహా ఇతర స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. అయితే దీనిపై కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఇప్పటిదాకా జిఫ్ ఫైల్స్ను వాట్సాప్ సపోర్ట్ చేయలేదు. ఇకపై దీన్ని కూడా ఆండ్రాయిడ్ యూజర్స్ షేర్ చేసుకోవచ్చు. యానిమేటెడ్ ఇమేజ్ ఉండే జిఫ్ ఫైల్స్ కోసం సరికొత్తగా బీటా రిలీజ్ (వీ2.167.1)ను వాట్సాప్ అభివృద్ధి చేసినట్లు సమాచారం. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియరాలేదు. కాగా, వైబర్లో జిఫ్ ఫైల్స్ ను ప్లే చేసుకునే అవకాశం ఇప్పటికే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.