సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ప్లాట్‌ఫాంలో వాటా కొనుగోలుతో వార్తల్లో నిలిచిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో ప్రముఖ వెబ్‌సైట్‌ను తన సొంతం చేసుకోనుంది. యానిమేటెడ్ ఇమేజెస్ లేదా జిఫ్‌లు రూపొందించే పాపులర్ వెబ్‌సైట్ జిఫీని కొనుగోలు చేస్తున్నామని శుక్రవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇన్‌స్టాగ్రామ్ ఫోటో షేరింగ్ యాప్‌తో దీన్ని అనుసంధానం చేస్తున్నట్టు వెల్లడించింది. (గుడ్ న్యూస్: జియో అదిరిపోయే ప్లాన్)
ఈ డీల్ వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ, దీని విలువ సుమారు 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,035 కోట్లు).ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ సైట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటర్నెట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన జిఫీ భాగం అవుతుంది. ఇకపై జిఐఎఫ్ లైబ్రరీ ఇన్‌స్టాగ్రామ్ , ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇతర యాప్‌లలో విలీనం కానుంది. ట్విటర్, స్నాప్‌చాట్, బైట్ డాన్స్ టిక్‌టాక్ వంటి సామాజిక వేదికలతో గిఫీ ప్రస్తుత అనుసంధానాలు మారవు అని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎప్పటిలాగానే వైడర్ ఎకోసిస్టంలో జిపీ అందుబాటులో వుంటుందని జిఫి కూడా ప్రకటించింది. తాజా భాగస్వామ్యంతో గొప్ప కంటెంట్‌ను సృష్టించగలుగుతాని ఇన్‌స్టాగ్రామ్ ఉత్పత్తి ఉపాధ్యక్షుడు విశాల్ షా అన్నారు. (ఫేస్‌బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం)
యాంటీట్రస్ట్ ఆందోళనలు, రెగ్యులేటర్ల పరిశీలన ఉన్న సమయంలో ఫేస్‌బుక్ ఈ డీల్‌ను వెల్లడించడం విశేషం. కాగా న్యూస్ సైట్ టెక్ క్రంచ్ ప్రకారం, 2015లో, గిఫీ ఒక ఫేస్‌బుక్ ఆఫర్‌ను తిరస్కరించి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల అనుసంధానంతో స్వతంత్రగా కొనసాగాలని నిర్ణయించుకుంది. (ట్రంప్ : డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల కోత?)
Comments
Please login to add a commentAdd a comment