ధనుష్ హాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ అవుట్ | Dhanush Hollywood Movie director Walked Away from the movie | Sakshi
Sakshi News home page

ధనుష్ హాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ అవుట్

Published Tue, Oct 25 2016 3:28 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

ధనుష్ హాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ అవుట్

ధనుష్ హాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్టర్ అవుట్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ఓ హాలీవుడ్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ధనుష్, తొలి సారిగా హాలీవుడ్ సినిమా చేస్తుండటంతో ఆ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. 'ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్' అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఫ్రెంచ్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈపాటికే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా.. దర్శకుడి అనూహ్య నిర్ణయంతో ఆగిపోయింది. ఇరాన్ ఫ్రెంచ్ ఫిలిం మేకర్ మర్జానే సత్రాపి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ప్రీ ప్రొడక్షన్ దశలోనే దర్శకుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవటంతో చిత్రయూనిట్ డైలామాలో పడింది. అయితే నిర్మాణ సంస్థ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ ను ఆపేది లేదని ప్రకటించింది. త్వరలోనే మరో దర్శకుడితో ధనుష్ హీరోగా 'ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ద ఫాకిర్' సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement