ఆ హీరోతో నేను డేటింగ్ చేయలేదు: సోనాక్షి
ఆ హీరోతో నేను డేటింగ్ చేయలేదు: సోనాక్షి
Published Sat, Nov 5 2016 11:09 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
బాలీవుడ్‌లో గాసిప్‌లకు ఏమాత్రం కొరత లేదు. ఒకప్పుడు బాగా కలిసి తిరిగిన అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా ఆ తర్వాత విడిపోయారు. తొలిసారిగా వీళ్ల బంధం విషయం 2015లో బయటపడింది. అప్పట్లో అర్జున్ కపూర్, రణవీర్‌సింగ్ కలిసి ఒక కార్యక్రమం నిర్వహించారు. దానికి వచ్చిన కమెడియన్ అబీష్ మాథ్యూ... సోనాక్షి సిన్హాతో డేటింగ్ చేస్తున్నందుకు కంగ్రాట్స్ అని చెప్పగా, దానికి అర్జున్ నవ్వుతూ తలాడించాడు. వాళ్ల బంధం ఇప్పుడు ముగిసిన కథ అనుకోవాలో.. లేదా ఇంకా కొనసాగుతోందని భావించాలో మాత్రం అర్థం కావట్లేదు.
ప్రస్తుతం జాన్ అబ్రహంతో కలిసి తాను నటిస్తున్న ఫోర్స్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మంచి బిజీగా ఉన్న సోనాక్షిని మీడియావాళ్లు అర్జున్ కపూర్ సంగతేంటని అడిగారు. ఇద్దరూ కలిసి ఒంటరిగా ఒక ద్వీపానికి వెళ్లారా అన్న ప్రశ్న అడిగినప్పుడు.. అబ్బే, అలా ఏమీ వెళ్లలేదని చెప్పింది. సోనాక్షితో బంధం తెగిపోయిందన్న బాధతో ఉన్న అర్జున్ కపూర్.. తాజాగా అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మలైకా అరోరా ఖాన్ ఇంటి బయట కనిపించాడట! రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆ ఇంట్లోకి వెళ్లి, మూడున్నర గంటల తర్వాత అతడు బయటకు వస్తుంటే కెమెరాలు అతగాడి వెంటపడ్డాయి.
Advertisement
Advertisement