చెత్త నటిగా సోనాక్షి హ్యాట్రిక్ | Sonakshi Sinha, Arjun Kapoor grab top Golden Kela awards | Sakshi
Sakshi News home page

చెత్త నటిగా సోనాక్షి హ్యాట్రిక్

Published Sun, Mar 15 2015 9:01 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

చెత్త నటిగా సోనాక్షి హ్యాట్రిక్

చెత్త నటిగా సోనాక్షి హ్యాట్రిక్

న్యూఢిల్లీ: బాలీవుడ్లో జతిన్ వర్మ ప్రారంభించిన చెత్త అవార్డు 'గోల్డెన్ కేలా'ను ఈ ఏడాది నటులు అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా సొంతం చేసుకున్నారు. గూండే చిత్రంలో నటించిన అర్జున్ కపూర్ చెత్త నటుడిగా పేరు తెచ్చుకున్నారు.  అలాగే యాక్షన్ జాక్సన్, లింగా, హాలీడే చిత్రాల్లో చెత్తగా నటించి సోనాక్షి ఈ అవార్డును కైవసం చేసుకున్నారని  జతిన్ వర్మ తెలిపారు.  సోనాక్షి సిన్హా ఈ చెత్త అవార్డును ముచ్చటగా మూడోసారి  వరుసగా దక్కించుకోవడం విశేషం.

ఎప్పుడూ ఉత్తమ అవార్డులేనా? చెత్త అవార్డులు కూడా ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ఈ గోల్డెన్ కేలా అవార్డు. 2009లో జతిన్ వర్మ ఈ అవార్డులను ప్రారంభించారు. తాజాగా చెత్త అవార్డులను ప్రకటించారు. మామూలుగా అయితే బెస్ట్ అవార్డ్ గోస్ టు... అంటారు కదా.. కానీ, ఈ వేదికపై వరస్ట్ అవార్డ్ గోస్ టు...అంటూ విజేతలను ప్రకటిస్తారు. ఆరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ అవార్డులకు రాను రాను క్రేజ్ పెరుగుతోందనీ సదరు అవార్డుల వ్యవస్థాపకుడు జతిన్ వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ఉత్తమ అవార్డులు అందుకోవడానికి అలవాటుపడ్డ తారలు, ఈ చెత్త అవార్డులను కూడా అంగీకరిస్తున్నారు. వీటిని సరదాగా తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement