ఆసక్తికరంగా దిల్ దివానా
ఆసక్తికరంగా దిల్ దివానా
Published Wed, Feb 5 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
రాజార్జున్, రోహిత్, కృతిక సింగల్, నేహా దేశ్‌పాండే ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘దిల్ దివానా’. తుమ్మ కిరణ్ దర్శకుడు. రాజారెడ్డి నిర్మాత. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇది ముక్కోణపు ప్రేమకథ. హృదయాన్ని స్పృశించే సున్నితమైన భావోద్వేగాలుంటాయి. ఆసక్తికరమైన కథనం, రొమాంటిక్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్స్. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే సినిమా ఇది. నాగబాబు పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ. లెజెండ్రీ క్రికెటర్ కపిల్‌దేవ్ చేతుల మీదుగా ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. వేణు, ధనరాజ్, రాఘవ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: రామ్‌నారాయణ్. ఆర్., ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయికృష్ణ గజవల్లి.
Advertisement
Advertisement