
నా భుజం తెగినట్లుగా ఉంది: రాఘవేంద్రరావు
హైదరాబాద్ : దర్శకరత్న దాసరి నారాయణారావు మృతి పట్లు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించారు. ‘ నా భుజం తెగినట్లుగా ఉంది. ఇద్దరం మూడేళ్ళ విడిదిలోనే చిత్రసీమలోకి వచ్చాము. కలిసి ఎదిగాము. ఒడిదిడుకులు చూసాము. నిలబడ్డాము. గెలిచాము. అప్పుడే మమ్మల్ని అందరిని వదిలి వెళ్తావని గ్రహించలేదు మిత్రమా.. నువ్వు ఏ లోకాన ఉన్న నీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’ అంటూ ఆయన బుధవారం ట్విట్ చేశారు.
కాగా దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఇవాళ మొయినాబాద్ మండలం తోల్‌కట్ట సమీపంలోని సొంత వ్యవసాయక్షేత్రం పద్మా గార్డెన్స్‌లో జరిగాయి.