గిన్నీస్ రికార్డ్ సాధించిన దర్శకుడు కన్నుమూత | Director Siraj passed away in Chennai | Sakshi
Sakshi News home page

గిన్నీస్ రికార్డ్ సాధించిన దర్శకుడు కన్నుమూత

Published Wed, Jul 26 2017 10:04 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

గిన్నీస్ రికార్డ్ సాధించిన దర్శకుడు కన్నుమూత - Sakshi

గిన్నీస్ రికార్డ్ సాధించిన దర్శకుడు కన్నుమూత

తమిళసినిమా: సీనియర్‌ దర్శకుడు షిరాజ్‌(65) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈయన నటుడు రామరాజన్ హీరోగా ఎన్నై పెత్త రాసా, తంగత్తిన్ తంగం, ఏరెల్లామ్‌ ఉన్ పాట్టు, ఆనందరాజ్‌ కథానాయకుడిగా ఎన్ రాజ్యాంగం తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్ రాజ్యాంగం చిత్రానికి ఆయనే నిర్మాత. కాగా 24 గంటల్లో తెరకెక్కిన గిన్నీస్‌ రికార్డు కెక్కిన స్వయంవరం అనే చిత్రానికి  ఈయనే దర్శకుడు.

పలు చిత్రాలకు కథ, మాటలు అందించిన షిరాజ్‌ చివరిగా దర్శకత్వం వహించిన చిత్రం మిన్నల్‌ విడుదల కాకముందే ఆయన మరణించారు. కొద్ది నెలల కిందట అనారోగ్యానికి గురైన షిరాజ్‌ సోమవారం గుండెపోటుకు గురి కావడంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక చెట్‌పెట్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించటంతో షిరాజ్‌ కన్నుమూశారు. ఆయనకు భార్య ఆయేషా, కూతుళ్లు యాశ్విన్, మన్సుర, భాను ఉన్నారు. షిరాజ్‌ అంతక్రియలు మంగళవారం సాయంత్రం కోడంబాక్కం, పులియూర్‌ పురంలో గల ముస్లీంల శ్మశాన వాటికలో నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement