
బాలీవుడ్ మూవీ కోసం దిశా..!
ఈ జనరేషన్ హీరోలతో కాలు కదపడానికి హీరోయిన్లు చాలానే కష్టపడాల్సి వస్తోంది. ముఖ్యంగా టైగర్ ష్రాఫ్ లాంటి ఎనర్జిటిక్ డాన్సర్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే హీరోయిన్లకు సవాలే. అందుకే ఓ ముద్దుగుమ్మ ఈ యంగ్ హీరోతో ఆడిపాడేందుకు తెగ కష్టపడుతోంది. స్పెషల్గా డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం టైం కేటాయించి విపరీతంగా ప్రాక్టీస్ చేసేస్తోంది.
లోఫర్ సినిమాతో టాలీవుడ్కి పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశాపటాని. తొలి సినిమాతోనే క్యూట్ లుక్స్తో ఆకట్టుకున్న ఈ బ్యూటి వెంటనే బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్తో కలిసి బేఫికరాలో నటిస్తున్న ఈ బ్యూటి ఓ డ్యాన్స్ సీక్వన్స్ కోసం తెగ కష్టపడి ప్రాక్టీస్ చేస్తోంది. అంతేకాదు తన ప్రాక్టీస్ వీడియోను అభిమానుల కోసం ట్విట్టర్లో షేర్ చేసింది.