
నటి దిశా పటాని (ఫైల్ ఫొటో)
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి దిశా పటాని గతంలో ఎంత చెత్తగా కనిపించేదో చూడండంటూ ఓ మీడియాలో వచ్చిన కథనంపై ఆమె వినూత్నరీతిలో స్పందించారు. అయితే తమ అభిమాన నటి దిశాను అందంగా లేదంటారా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరోవైపు తన అందంపై వచ్చిన కామెంట్లపై దిశా ట్వీట్ చేశారు. మీరు చాలా నిజమే చెప్పారు. ఏడో తరగతి చదవబోయే విద్యార్థిని ఎంతో అందమైన డ్రెస్సులు ధరించి, అందంగా కనిపించేలా మేకప్, హెయిర్ స్టెయిల్‌తో కనిపించలేదు. మీకు ఇంతకంటే బెటర్ బ్రేకింగ్ న్యూస్ ఏదీ దొరకలేదా అంటూ తన ట్వీట్ ద్వారా సున్నితంగా విమర్శించారు దిశా.
తాను అందంగా లేదంటూ వచ్చిన మీడియా కథనంపై దిశా స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దాంతో పాటుగా నటి అందంపై అనవసరంగా పోస్ట్ చేశారని, వారి ఆలోచనలు ఎలా ఉంటే అలాగే వ్యక్తులు కనిపిస్తారంటూ చురకలంటిస్తున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారని కొందరు, మీరు ఎప్పుడూ ఇదే విధంగా సంతోషంగా, ధైర్యంగా ముందుకు సాగాలంటూ మరికొందరు ట్వీట్లు చేశారు. అలాంటి చెత్త వార్తలపై మీరు స్పందించి సమయం వృథా చేసుకోకూడదంటూ మరికొందరు నెటిజన్లు నటి దిశా పటానికి సూచించారు.
వివాదం ఏంటంటే..
ఓ జాతీయ మీడియా నటి దిశా పటానీ స్కూలు రోజుల్లో దిగిన ఫొటో, ప్రస్తుత ఫొటోను జతచేస్తూ.. గతంలో నటి ఎంత విహీనంగా ఉండేదో తెలుసా.. మీరు ఆమె అందంలో ఎంత మార్పు వచ్చిందో పోల్చుకోండంటూ ట్వీట్ చేయడంతో వివాదం మొదలైంది. ఇలాంటి కథనాలు రాయడం మంచిది కాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ల స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment