నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూత | edida nageswararao died due to ill | Sakshi
Sakshi News home page

నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూత

Published Sun, Oct 4 2015 6:29 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూత - Sakshi

నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయాన్ని బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 8లోని ఆయన స్వగృహానికి తరలించారు. 1934లో ఏప్రిల్ 24న తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో జన్మించారు.

రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన చిత్రాల్లో ఆణిముత్యాల్లాంటివి కొన్ని..
    ఆపద్బాంధవుడు (1992)
    స్వరకల్పన (1989)
    స్వయంకృషి (1987)
    సిరివెన్నెల (1986)
    స్వాతిముత్యం (1985)
    సాగర సంగమం (1983)
    సితార (1983)
    సీతాకోకచిలుక (1981)
    తాయారమ్మ బంగారయ్య (1979)
    శంకరాభరణం (1979)
    సిరిసిరిమువ్వ (1978)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement