వినోదభరితంగా ట్యూబ్‌లైట్‌ | Entertaining movie Tube Light | Sakshi
Sakshi News home page

వినోదభరితంగా ట్యూబ్‌లైట్‌

Published Thu, Jan 19 2017 4:44 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

వినోదభరితంగా ట్యూబ్‌లైట్‌

వినోదభరితంగా ట్యూబ్‌లైట్‌

వినోదంతో కూడిన వినూత్న కథా చిత్రంగా ట్యూబ్‌లైట్‌ చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు ఇంద్ర తెలిపారు. కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగులకు శిక్షకుడిగా వ్యవహరించిన ఈ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడు సినీ మోహంతో యాడ్‌ రంగంలో మొదట తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆ తరువాత చిత్ర రంగప్రవేశం చేసి తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం ట్యూబ్‌టైట్‌. అంతే కాదు ఈ చిత్రానికి కథ, కథనం, సంగీతం బాధ్యతలతో పాటు కథానాయకుడి భారాన్ని తనే మోసిన చిత్రం ఇది. ఆస్ట్రిచ్‌ మీడియా ప్రొడక్షన్‌ పతాకంపై రవినారాయణన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి అతిథి నాయకిగా నటించారు. ప్రధాన పాత్రల్లో సీనియర్‌ నటుడు పాండ్యరాజన్‌ నటించిన ఇందులో మలయాళ నటుడు ప్రవీణ్‌ప్రేమ్, త్రిభువన్, ధనుంజయన్, వినోద్, రమణి నూతన నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.

 చిత్రం వివరాలను దర్శకుడు, కథానాయకుడు ఇంద్ర బుధవారం చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుపుతూ పలు యాడ్‌ చిత్రాలను రూపొందించిన తాను కథానాయకుడిగా నటించాలని, అందుకు తగ్గట్టుగా ఆరేళ్ల క్రితం కథను తయారు చేసుకుని, దానికి మెరుగులు దిద్దుకుంటూ తెరకెక్కించిన చిత్రం ట్యూబ్‌లైట్‌ అని తెలిపారు. ఇది బయాలాజికల్, ఫిలాసఫికల్‌ ఎలిమెంట్స్‌తో కూడిన కామిక్స్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. రొమాంటిక్, కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కించిన ఈ ట్యూబ్‌లైట్‌ చిత్రాన్ని చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు.

ఈ చిత్రంలో కథానాయకి ఆర్థోథెరపిస్ట్‌గా నటించారని తెలిపారు. నిర్మాత రవి నారాయణన్‌ మాట్లాడుతూ తమ సంస్థకు తొలి చిత్రం కావడంతో ఒక ౖవైవిధ్య భరిత కథను ఎంచుకోవాలని భావించిన తరుణంలో ఇంద్ర ఈ ట్యూబ్‌లైట్‌ కథతో వచ్చారన్నారన్నారు. తను ఒక పుల్‌ప్లెడ్జ్‌డు కిట్‌తో రావడం, కథ తాము కోరుకున్న స్థాయిలో ఉండడంతో చిత్ర నిర్మాణానికి పూనుకున్నామని, ట్యూబ్‌టైట్‌ చిత్రం తాను అనుకున్న దానికంటే బాగా  వచ్చిందని సంతృప్తి వ్యక్తం చేవారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement