భారీ లాభాల బాటలో సంక్రాంతి ఎక్స్‌ప్రెస్ రాజా | Express Raja review | Sakshi
Sakshi News home page

భారీ లాభాల బాటలో సంక్రాంతి ఎక్స్‌ప్రెస్ రాజా

Published Sun, Jan 17 2016 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM

భారీ లాభాల బాటలో సంక్రాంతి ఎక్స్‌ప్రెస్ రాజా

భారీ లాభాల బాటలో సంక్రాంతి ఎక్స్‌ప్రెస్ రాజా

విడుదలైన మొదటి వారంలోనే లాభాల్లోకి ఎంటర్ అవుతున్న మొదటి సంక్రాంతి చిత్రంగా నిలవనున్న యువి క్రియేషన్స్ నిర్మించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఓ స్టార్ హీరో సినిమా వస్తుందంటే కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తాం. ఓ స్టార్ డెరైక్టర్ సినిమా విడుదలవుతుందంటే ఉండే హంగా మానే వేరు. స్టార్ హీరోలకు, స్టార్ డెరైక్టర్ల చిత్రాలకు ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందో... అంతటి క్రేజ్ సంపాదించుకున్న సంస్థ ‘యువి క్రియేషన్స్’. ప్రభాస్‌తో ‘మిర్చి’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం నిర్మించిన తర్వాత యువి క్రియేషన్స్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి.  ‘మిర్చి’లాంటి భారీ చిత్రం తర్వాత ‘రన్ రాజా రన్’ వంటి మీడియం బడ్జెట్ చిత్రాన్ని నిర్మించి, అన్ని రకాల చిత్రాల్ని ప్రోత్సహించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిరూపించారు.
 
  ‘మిర్చి’తో కొరటాల శివను, ఆ తర్వాత ‘రన్ రాజా రన్’తో సుజిత్‌ను దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేశారు. గోపీచంద్‌లోని స్టైలిష్ యాంగిల్‌ను ప్రెజెంట్ చేస్తూ, తీసిన  ‘జిల్’ ద్వారా రాధాకృష్ణ కుమార్‌ను దర్శకునిగా పరిచయం చేసింది యువి క్రియేషన్స్. మారుతీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్‌కు చెందిన జిఎ 2 పతాకంతో కలసి నిర్మించిన ‘భలే భలే మగాడివోయ్’ ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది యువి క్రియేషన్స్.  ‘బాహుబలి’ కి ముందు ‘మిర్చి’ చిత్రం ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్. ‘రన్ రాజా రన్’ శర్వానంద్‌కు, ‘భలే భలే మగాడివోయ్’ నానికి బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో యువి క్రియేషన్స్‌లో సినిమా తప్పకుండా చేయాలనే ఆసక్తి అందరిలో కలుగుతోంది.
 
 మంచి కంటెంట్, క్వాలిటీ, కమిట్‌మెంట్‌తో కన్విన్సింగ్‌గా నిర్మిస్తే బ్లాక్ బస్టర్స్ అవుతాయనడానికి మరో నిదర్శనం తాజా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. కామెడీనే ప్రధాన వస్తువుగా... హాలీవుడ్ సినిమాల్లో మనం చూసే స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో కుటుంబం అంతా కలసి హాయిగా నవ్వుకునే చిత్రాన్ని నిర్మించింది యువి క్రియేషన్స్. ఒకసారి కథను, దర్శకుణ్ణి నమ్మిన తర్వాత ఫ్రీడమ్ ఇస్తే అద్భుతమైన చిత్రాలు బయటికొస్తాయనడానికి ఎగ్జాంపుల్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. అలాంటి ఫ్రీడమ్‌ను అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ సంక్రాంతి పండగ బరిలో ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, బాలకృష్ణ ‘డిక్టేటర్’, నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి భారీ చిత్రాలతో పాటు ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రం విడుదలైంది. బడ్జెట్ తక్కువైనా క్వాలిటీ, థియేటర్స్, ప్రమోషన్ విషయంలో రాజీపడలేదు.
 
 సంక్రాంతి పర్వదినాన విడుదలైన అన్ని చిత్రాల్లోకెల్లా ముందుగా బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంటున్న చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కావడం విశేషం. అన్ని సెంటర్స్‌లో మంచి రెస్పాన్స్ సాధించి, డిస్ట్రిబ్యూటర్స్ మంచి లాభాలు గడించే చిత్రంగా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ నిలిచింది. సంక్రాంతి బరిలో నిలుస్తుందా?  అన్నవారే ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ చూసి ఔరా అంటున్నారు. సుమారు 7 కోట్ల రూపాయలతో నిర్మించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రం విడుదలైన మూడు రోజులకే ఐదున్నర కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది. సోమవారానికి లాభాల బాట పయనించనుందన్న మాట.
 
 ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ ఘనవిజయం అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి మాట్లాడుతూ -‘‘మా సంస్థ నుంచి వచ్చిన ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘జిల్’, ‘భలే భలే మగాడి వోయ్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రాలను ఘనవిజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లోనే తొందరగా బ్రేక్ ఈవెన్ అందుకోబోతున్న చిత్రంగా ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ నిలవడం సంతోషంగా ఉంది. విడుదలైన తొలివారమే లాభాలు అందుకోబోతోంది.
 
  ఈ సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ వీక్ కాంపిటీషన్ వల్ల తక్కువ స్క్రీన్స్‌లో విడుదలైంది. రెండో వారం నుంచి మరిన్ని థియేటర్స్ యాడ్ అవుతున్నాయి. చెన్నై, కర్ణాటకలోనూ రిలీజ్ చేస్తున్నాం. మౌత్ టాక్, మంచి రివ్యూలు రావడం తో రెండో వారంలోనూ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ప్రేక్షకులు అందిస్తున్న ఆదరణకు, చూపిస్తున్న అభిమానానికి తగ్గట్టుగా మరిన్ని మంచి చిత్రాలను భవిష్యత్తులో అందిస్తామని మాటిస్తున్నాం’’ అని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement