మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌ | Fan Emotional After Seeing Vijay Deverakonda | Sakshi
Sakshi News home page

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

Published Sun, Jul 28 2019 8:12 PM | Last Updated on Sun, Jul 28 2019 8:18 PM

Fan Emotional After Seeing Vijay Deverakonda - Sakshi

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండకు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ గురించి అందరికి తెలిసిందే. అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లోనే విజయ్‌కు క్రేజ్‌ ఎక్కువ. అయితే తాజాగా ఓ మహిళా అభిమాని విజయ్‌ను చూడటంతో ఎమోషన్‌ అయ్యారు. తన అభిమానాన్ని ఎలా చెప్పాలో తెలియక ఆనందంతో బోరున విలపించారు. ఇది గమనించిన విజయ్‌ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన కొద్ది రోజుల క్రితమే జరిగినప్పటికీ.. ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం క్లారిటీ లేదు. విజయ్‌ తన తాజా చిత్రం డియర్‌ కామ్రేడ్‌ ప్రమోషన్‌లో భాగంగా చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లలో మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించారు. అప్పుడే ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement