
ఫెస్టివల్ మూడ్
ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత ఉందో... దానికి రెట్టించిన ఫెస్టివ్ మూడూ అంతే ఉంటుంది బాలీవుడ్‌లో. విడి రోజుల్లో ఎలా ఉన్నా... ఎంత బిజీగా గడిపినా... పండుగకు మాత్రం అంతా కలసి ధూంధాంగా సంబరాలు చేసుకొని ఎంజాయ్ చేస్తారు స్టార్స్. ఈసారి దీపావళికి సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ బాంద్రాలోని తన ఇంట్లో బిగ్‌బాష్ పార్టీ అరేంజ్ చేశాడట. అతిథులెవరెవరో తెలుసా..! హృతిక్‌రోషన్, రణవీర్ కపూర్, దీపికా పడుకొనే, ప్రియాంకా చోప్రా, కరణ్ జోహార్, అశుతోష్ గోవరికర్ వంటి బడాబడా పర్సనాల్టీలు అటెండ్ అవుతున్నాయట.