‘లక్ష్మీ బాంబ్‌’ ఫస్ట్‌ లుక్‌ | First look of Akshay Kumar in Laxmmi Bomb | Sakshi
Sakshi News home page

‘లక్ష్మీ బాంబ్‌’ ఫస్ట్‌ లుక్‌

Published Sat, May 18 2019 1:12 PM | Last Updated on Sat, May 18 2019 4:34 PM

First look of Akshay Kumar in Laxmmi Bomb - Sakshi

దక్షిణాదిలో ఘన విజయం సాధించిన కాంచన సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలో ఈ చిత్రాలకు దర్శకత్వం వహించి, నటించిన రాఘవ లారెన్స్‌.. బాలీవుడ్ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. సినిమాలో హిజ్రా గెటప్‌కు సంబంధించిన అక్షయ్‌ లుక్‌ను ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో రివీల్ చేశారు. అక్షయ్‌ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ మరో కీలక పాత్రలో నటించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. సౌత్‌లో శరత్‌ కుమార్ నటించిన హిజ్రా పాత్రలో బిగ్‌బీ నటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను 2020 జూన్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement