నలుగురు హీరోయిన్లతో ‘లవ్ చేయాలా వద్దా’ | Four heroines in love chayala vadda | Sakshi

నలుగురు హీరోయిన్లతో ‘లవ్ చేయాలా వద్దా’

Dec 5 2015 10:34 AM | Updated on Aug 28 2018 4:30 PM

నలుగురు హీరోయిన్లతో ‘లవ్ చేయాలా వద్దా’ - Sakshi

నలుగురు హీరోయిన్లతో ‘లవ్ చేయాలా వద్దా’

కార్తీక్, శ్వేత వర్మ జంటగా ‘లవ్ చేయాలా వద్దా’ చిత్రం రూపొందించినట్లు డెరైక్టర్ ఎన్ నౌషద్ తెలిపారు.

విశాఖపట్నం : కార్తీక్, శ్వేత వర్మ జంటగా ‘లవ్ చేయాలా వద్దా’ చిత్రం రూపొందించినట్లు  డెరైక్టర్ ఎన్ నౌషద్ తెలిపారు. చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో ముగ్గురు హీరోయిన్లుగా ప్రియాంక రాథోడ్, పావని, హనీజోలు నటించారని ఆయన వెల్లడించారు.  జీకె సినిమాస్ బ్యానర్‌పై జి.వి.సంతోషికుమారి నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.
 
‘లవ్ చేయాలా వద్దా’ చిత్రానికి తనతో పాటు పనిచేసిన ఎక్కువ మంది విశాఖ వాసులే కావడం విశేషమని, ఇక్కడి అందమైన లోకేషన్లలోనే అధిక శాతం షూటింగ్ జరిపామని వివరించారు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందున’ చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టిన హీరో కార్తీక్ తర్వాత నటించిన ఓ తమిళ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా ఆయన చేసిన రెండవ తెలుగు సినిమా ‘లవ్ చేయాలా వద్దా’ అని, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, మనం చిత్రాల్లోనూ నటించిన శ్వేత వర్మకు హీరోయిన్‌గా మంచి బ్రేక్ ఇచ్చే చిత్రం అవుతుందని నౌషద్ అన్నారు.

డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా ప్రవీణ్ కాండ్రేగుల, సంగీత దర్శకుడిగా గౌతమ్ డానీ, కో డెరైక్టర్‌గా బి.సంతోష్ పనిచేసిన ఈ చిత్రంలో స్వామి రారా...చిత్రం ఫేం సత్య, ఈ రోజుల్లో, బస్‌స్టాప్ ఫేం సాయి, జబర్దస్త్ అప్పారావు, ఎఫ్‌ఎం బాబాయ్, ప్రసన్నకుమార్, షేక్ శ్రీను ఇతర ముఖ్య పాత్రలో నటించారని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement