four heroines
-
నలుగురు హీరోయిన్లతో ‘లవ్ చేయాలా వద్దా’
విశాఖపట్నం : కార్తీక్, శ్వేత వర్మ జంటగా ‘లవ్ చేయాలా వద్దా’ చిత్రం రూపొందించినట్లు డెరైక్టర్ ఎన్ నౌషద్ తెలిపారు. చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో ముగ్గురు హీరోయిన్లుగా ప్రియాంక రాథోడ్, పావని, హనీజోలు నటించారని ఆయన వెల్లడించారు. జీకె సినిమాస్ బ్యానర్‌పై జి.వి.సంతోషికుమారి నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. ‘లవ్ చేయాలా వద్దా’ చిత్రానికి తనతో పాటు పనిచేసిన ఎక్కువ మంది విశాఖ వాసులే కావడం విశేషమని, ఇక్కడి అందమైన లోకేషన్లలోనే అధిక శాతం షూటింగ్ జరిపామని వివరించారు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందున’ చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టిన హీరో కార్తీక్ తర్వాత నటించిన ఓ తమిళ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా ఆయన చేసిన రెండవ తెలుగు సినిమా ‘లవ్ చేయాలా వద్దా’ అని, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, మనం చిత్రాల్లోనూ నటించిన శ్వేత వర్మకు హీరోయిన్గా మంచి బ్రేక్ ఇచ్చే చిత్రం అవుతుందని నౌషద్ అన్నారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా ప్రవీణ్ కాండ్రేగుల, సంగీత దర్శకుడిగా గౌతమ్ డానీ, కో డెరైక్టర్‌గా బి.సంతోష్ పనిచేసిన ఈ చిత్రంలో స్వామి రారా...చిత్రం ఫేం సత్య, ఈ రోజుల్లో, బస్‌స్టాప్ ఫేం సాయి, జబర్దస్త్ అప్పారావు, ఎఫ్ఎం బాబాయ్, ప్రసన్నకుమార్, షేక్ శ్రీను ఇతర ముఖ్య పాత్రలో నటించారని వెల్లడించారు. -
ముగ్గురు హీరోలు - నలుగురు హీరోయిన్స్
మళయాలంలో పెద్ద హిట్‌గా నిలిచి, కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించిన 'బెంగళూరు డేస్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో రీమేక్ చేయడానికి చురుకుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలకు ప్రధాన్యత పెరిగింది. ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. అదేకోవలో హాస్యరసప్రధానంగా రూపొందే ఈ సినిమాలో నలుగురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. తెలుగులో ప్రముఖ నిర్మాతలు పొట్లూరి వరప్రసాద్, దిల్ రాజు కలసి దీనిని నిర్మించాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీనిని ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నందున రెండు భాషల ప్రేక్షకులకు నచ్చిన హీరోహీరోయిన్లు కావాలి. ఒక సినిమాకు ఒక హీరో ఇద్దరు హీరోయిన్లను వెతకడమే నిర్మాతలకు కష్టం. కథ వారికి నచ్చాలి - కాల్షీట్లు ఖాళీ ఉండాలి - ఇవన్నీ కాక ఎవరికి ఏ పాత్ర అనే విషయం తేలాలి - వారి ఆమోదం కావాలి... ఇలా అనేకం కుదరాలి. ఇటువంటి పరిస్థితులలో రెండు భాషలు-ముగ్గురు హీరోలు, నలుగురు హీరోయిన్లు అంటే నిర్మాత దర్శకులు ఎన్ని తిప్పలు పడాలో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నిర్మాతలు దిగ్గజాలు కాబట్టి కొంతవరకు పరవాలదనుకోండి. బొమ్మరిల్లు సినిమాతో రాత్రికి రాత్రి అగ్రదర్శకుడైపోయిన భాస్కర్‌కు ఈ చిత్రం దర్శకత్వ బాధ్యతలు దిల్ రాజు అప్పగించినట్లు తెలుస్తోంది. బొమ్మరిల్లు తరువాత ఆరెంజ్, ఒంగోలు గిత్తల పరాజయంతో భాస్కర్‌కు టాలీవుడ్‌కు మొఖం చూపించలేని పరిస్థితి ఎదురైంది. అయినా దైర్యం చేసి ఎంతో నమ్మకంతో దర్శకుడిగా భాస్కర్‌నే దిల్ రాజు ఎంపికచేశారని చెబుతున్నారు. మలయాళంలో అంజలిమీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా సినిమాలో మెలోడ్రామాను శిఖర స్థాయికి తీసుకువెళ్లగలిగిన భాస్కర్ ఈ సినిమా కథ, కథనాలు తెలుగు సంస్కృతికి దగ్గరగా ఉండేవిధంగా మెరుగులు దిద్దే పనిలో ఉన్నట్లు సమాచారం.భాస్కర్‌కు ఇదో మంచి సదవకాశంగా భావించవచ్చు. ఇక హీరోల విషయానికి వస్తే నాగచైతన్య - నాని - శర్వానంద్ - ఆర్య - సిద్ధార్ధ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారితో నిర్మాతలు సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ముగ్గురులో ఓ హీరోగా చైతన్య సరిపోతాడని భావిస్తున్నారు. అయితే ఈ కథ విన్న తరువాత చైతన్య పెద్దగా స్పందించలేదని తెలుస్తోంది. అందువల్ల చైతన్య స్థానంలో తమిళ హీరోలు ఆర్య, సిద్దార్థ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మిగిలిన ఇద్దరూ హీరోల విషయానికి వస్తే నాని - శర్వానంద్‌లను ఎంపిక చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. వీరు ఇద్దరూ తెలుగులో పాటు తమిళంలో కూడా ఇమేజ్ ఉన్నవారే. హీరోయిన్ల విషయానికి వస్తే సమంతను ఖరారు చేసినట్లు సమాచారం. ఇంకా ముగ్గురు కావాలి. ఆ వేటలోనే నిర్మాత దర్శకులు ఉన్నారు. ఈ చిత్రం టైటిల్ తెలుగులో 'హైదరాబాద్ డేస్', తమిళంలో 'చెన్నై డేస్' అని పెట్టే అవకాశం ఉంది. - శిసూర్య