
సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి రమేశ్ బాబు, మహేశ్ బాబు, మంజుల, సుధీర్ బాబు ఇండస్ట్రీకి వచ్చారు. అయితే ఇందులో మహేశ్ బాబు మాత్రమే సూపర్‌స్టార్‌గా నిరూపించుకున్నారు. రమేశ్‌బాబు ఎప్పుడో సినిమాలు చేయడం ఆపేశారు. మంజుల ఇటీవలే ‘మనసుకు నచ్చింది’ సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ అది నిరాశ పరిచింది. సుధీర్ బాబు తనను తాను నిరూపించుకోవడానికి కష్టపడుతున్నారు. ప్రస్తుతం సుధీర్‌బాబు ‘సమ్మోహనం’ సినిమాతో బిజీగా ఉన్నారు.
అయితే వీరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడి ఎంట్రీ ఖరారైంది. మహేశ్ బాబు బావ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లాను వెండితెరకు పరిచయం చేయనున్నారు. సినిమాకు సంబంధించిన వివరాలు.. ఇది ఒక టర్కిష్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇక్కడి నేటివిటికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం. ‘ఆడు మగాడ్రా బుజ్టి’ డైరెక్టర్ క్రిష్ణారెడ్డి దర్శకత్వం వహించగా, దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment