ప్రేమా? ఆకర్షణా? | Gangula-Kamalakar,Karimnagar mla new movie opening | Sakshi
Sakshi News home page

ప్రేమా? ఆకర్షణా?

Published Thu, Sep 11 2014 11:41 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

ప్రేమా? ఆకర్షణా? - Sakshi

ప్రేమా? ఆకర్షణా?

ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియక యువత తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు? అనే కథాంశంతో బి.యస్. నాయక్ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఎడ్ల మల్లేశం సమర్పణలో బి. ఆంజనేయులు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్లాప్ ఇచ్చారు. అనంతరం దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రేమ వివాహానికీ పెద్దలు కుదిర్చిన వివాహానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరికొత్త రీతిలో ఆవిష్కరించే చిత్రమిది. జీవితంలో అత్యంత కీలకమైన దశ యవ్వనం. ఆ దశను యువత సంపూర్ణంగా అనుభవిస్తోందా? అనే అంశం గురించి కూడా చర్చిస్తున్నాం’’ అని చెప్పారు. సూర్య, శ్రీకాంత్, అలేఖ్య, అపర్ణ రేణు, దీప్తి, శ్రీరాముల సత్యనారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వంశీ మామిడాల, కెమెరా: ఆర్కే అనంతుల శ్రవణ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement