గౌతమ్‌ని చూస్తే ‘పోరాటం’లో మహేష్ గుర్తొచ్చాడు
‘‘అప్పట్లో ‘పోరాటం’ సినిమాలో మహేష్ బాల నటుడిగా చాలా ఈజ్‌తో చేశాడు. ఇప్పుడు ఈ సినిమాలో గౌతమ్‌ని చూస్తుంటే ‘పోరాటం’లో మహేష్ గుర్తొస్తున్నాడు. గౌతమ్ చాలా ఈజ్‌తో చేశాడు’’ అని కృష్ణ చెప్పారు. మహేష్‌బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘1’ (నేనొక్కడినే) చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ప్రివ్యూని హైదరాబాద్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణ చూశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ -‘‘ఇందులో మహేష్ నటన అసాధారణంగా ఉంది.
ఒక రెగ్యులర్ సినిమాలా కాకుండా హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. సుకుమార్ చాలా బాగా తీశాడు. ఫొటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మొదటివారమే పెద్ద రికార్డ్ క్రియేట్ చేస్తుంది’’ అన్నారు.