ఆ మిస్టరీ గర్ల్ ఎవరో తెలిసిపోయింది! | Girl became internet sensation because of srk selfie effect | Sakshi
Sakshi News home page

ఆ మిస్టరీ గర్ల్ ఎవరో తెలిసిపోయింది!

Published Sun, Feb 5 2017 7:51 PM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

ఆ మిస్టరీ గర్ల్ ఎవరో తెలిసిపోయింది!

ఆ మిస్టరీ గర్ల్ ఎవరో తెలిసిపోయింది!

న్యూఢిల్లీ: సెలబ్రిటీలతో ఎవరైనా సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంటారు. అయితే తన లేటెస్ట్ మూవీ 'రాయిస్' ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ పుణెలో ఓ కాలేజీలో సెల్ఫీలు తీసుకున్నారు. షారుక్ కలెక్ట్ చేసిన ఓ ఫొటోను గతవారం తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఫొటో వైరల్‌గా మారింది. దీంతో 21 ఏళ్ల యువతి సైమా హుస్సేన్ ఇంటర్‌నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. హీరో పోస్ట్ చేసిన ఒక్క ఫొటో యువతికి ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ ఫొటోకు విపరీతంగా లైక్స్, షేర్లతో పాటుగా ఆ యువతి ఎవరు, ఆమె వివరాలు తెలిస్తే ప్లీజ్ చెప్పాలంటూ నెటిజన్లు కామెంట్ బాక్స్‌లో అడిగారు. చివరగా ఆమె వివరాలను కొందరు బయటపెట్టారు.

ఈ ఫొటోలో ఆలీవ్ గ్రీన్ టాప్‌లో ఉన్న యువతి చూపులు ఎందరినో ఆకట్టుకున్నాయి. యువతి పేరు సైమా హుస్సేన్ మీర్. ఈమెది కశ్మీర్ లోని శ్రీనగర్ ప్రాంతం. షారుక్ పోస్ట్ చేసిన ఒక్క ఫొటోతో పాపులర్ అయిపోయింది సైమా. ఆమె చాలా అందంగా ఉందని మోడల్‌గా రాణించే అవకాశాలు ఉన్నాయని నెటిజన్లు భావిస్తున్నారు. ఫేస్‌బుక్ యూజర్లు సెర్చ్‌ చేసి సైమా వివరాలతో పాటు ఆమె ఫొటోలను వెతికి విపరీతంగా లైక్స్ కొడుతూ, షేర్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement