'స్ఫూర్తి'గా హన్సిక | Hansika as spoorthi in gautham nanda | Sakshi
Sakshi News home page

'స్ఫూర్తి'గా హన్సిక

Published Fri, Jun 23 2017 4:06 PM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM

'స్ఫూర్తి'గా హన్సిక

'స్ఫూర్తి'గా హన్సిక

శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'గౌతమ్ నంద'. గోపీచంద్ సరసన హన్సిక, కేథరీన్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్కు సంపత్ నంది దర్శకుడు. ఇప్పటికే కేథరిన్ క్యారెక్టర్ను ఇంట్రడ్యూస్ చేసిన చిత్ర బృందం ఈ రోజు (శుక్రవారం) మరో కథానాయిక, హన్సిక లుక్ ను విడుదల చేశారు. కోలీవుడ్ లో బిజీగా హీరోయిన్ గా ఉన్న హన్సిక ఈ సినిమా స్ఫూర్తిగా కనపించనుంది.
 
ట్రెడిషనల్ అమ్మాయిగా హన్సిక నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గౌతమ్నంద ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆడియో వేడుకను గ్రాండ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement