spoorthi
-
మన బలమేంటో మనమే నిరూపించాలి
క్రీడల పట్ల ఆసక్తితోపాటు చదువులోనూ రాణిస్తూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది హైదరాబాద్ వాసి, 28 ఏళ్ల స్ఫూర్తి ఏనుగు. లా చదువుతూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లోనూ పాల్గొని పతకాలు సాధిస్తోంది. ఇటీవల కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా పవర్ లిఫ్టర్ స్ఫూర్తి ఏనుగు పంచుకున్న విషయాలు ఇవి... ‘‘సహజంగా ఇళ్లలో బరువులెత్తే పనులు అమ్మాయిలకు చెప్పరు. అవి, కేవలం అబ్బాయిల పనే అన్నట్టు చూస్తారు. చిన్నప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం లేదా టెక్నిక్స్ తెలుసుకుంటే బరువులు ఎత్తడం అమ్మాయిలకూ సులువే. ప్రొఫెషనల్ అవ్వాలన్నా, శారీరక బరువు, మానసిక సమతుల్యత సాధించాలన్నా వెయిట్ మానేజ్మెంట్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఛాలెంజెస్ అమ్మాయిలకు ఈ రంగంలో ప్రధాన సమస్య నెలసరి సమస్య. అది ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి ఒకే బరువును మోయలేం. శక్తిలోనూ మార్పులు వస్తుంటాయి. ఇందుకు తీసుకునే ఆహారం అబ్బాయిలతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. బరువులు ఎత్తే సమయంలో కండరాలు పట్టేస్తుంటాయి. దెబ్బలు తగులుతుంటాయి. జాయింట్స్ దగ్గర సమస్యలు వస్తుంటాయి. బరువులు ఎత్తే సమయంలో ఊపిరిలో తేడాలు వస్తుంటాయి. కానీ, వీటన్నింటినీ సాధనతో అధిగమిస్తుంటాను. మంచి ఆహారం, సరైన నిద్రాసమయం, స్ట్రెస్ లెవల్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రతిరోజూ ప్రయత్నిస్తుంటాను. ఈ విషయంలో మా అమ్మ సాధన, నాన్న రామారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. బరువును బ్యాలెన్స్ చేసుకోవడానికి... సెకండ్ క్లాస్ నుంచి స్పోర్ట్స్‌లో ప్రవేశం ఉంది. డిస్క్ త్రో, జావలిన్ త్రో వంటి క్రీడల్లో పతకాలు సాధించాను. రెండేళ్ల నుంచి వెయిట్‌లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. కరోనా టైమ్‌లో బరువు పెరిగాను. పది కేజీల బరువు తగ్గాలనుకున్నాను. అందుకు డైట్లో మార్పులు చేసుకోవడానికి బదులు నాకు ఎలాగూ స్పోర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి, బరువు తగ్గడానికి వెయిట్‌లిఫ్టింగ్ సాధన చేశాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనల్ని మనం ఎలా క్రమశిక్షణగా మలచుకోవాలో నిపుణుల ఆధ్యర్వంలో తెలిసిపోతుంది. అందుకు అనుగుణంగా సరైన దినచర్యను అమలు చేసుకుంటూ, విజయం దిశగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. ఆలోచనలో మార్పు.. అమ్మాయిలు చిన్నప్పటి నుంచే క్రీడలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వారు ఎంచుకున్న రంగంలోనూ చాలా బాగా దూసుకుపోగలరు. ఇంట్లో వాటర్క్యాన్స్, గ్యాస్ సిలిండర్, సోఫా.. వంటి బరువులు ఎత్తడంలో కూడా టెక్నిక్స్ ఉంటాయి. సాధారణంగా అమ్మాయిలు కూడా 50–60 కేజీల బరువు ఎత్తగలరు. కానీ, టెక్నిక్స్ తెలియకుండా ఎత్తి, నొప్పితో బాధపడుతుంటారు. దీంతో అమ్మాయిలు వెయిట్ లిఫ్టింగ్ చేయలేరు అనే అభిప్రాయం మనలో చాలా మందిలో పాతుకుపోయి ఉంది. మన ఆలోచనలో మార్పు రావాలంటే తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ దిశగా అమ్మాయిలను ప్రోత్సహించాలి. క్రీడలతోపాటు ... చదువునూ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎంబీయే పూర్తి చేశాను. సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతూనే స్పోర్ట్స్‌లో సాధన చేస్తూ వచ్చాను. ఇప్పుడు లా చదువుతున్నాను. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనే కాదు, కిందటి నెలలో కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన ఏడబ్ల్యూసీ ఓపెన్ వరల్డ్ కప్‌లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించాను. మా అమ్మనాన్నల ప్రోత్సాహంతో పాటు కోచ్ ఇచ్చే గైడెన్స్ ఎంతగానో తోడ్పడుతున్నాయి. మరిన్ని పోటీలు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిచోటా ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటిని దృఢ సంకల్పంతో, పట్టుదలతో ఎదుర్కొన్నవారే విజేతలవుతారు. ‘వెయిట్ లిఫ్టింగ్ అంటే అబ్బాయిలదే. అమ్మాయిలకు ఏం సాధ్యమవుతుంది, సూటవదు’ అనే మాట ఇప్పటికీ ఈ రంగంలో మొదటగా వినిపిస్తుంది. కానీ, మనల్ని మనం గెలిచి చూపినప్పుడు అమ్మాయిలుగా మన బలం ఏంటో కూడా ప్రపంచానికి తెలుస్తుంది’’ అని వివరిస్తుంది స్ఫూర్తి. – నిర్మలారెడ్డి -
స్ఫూర్తి మినియేచర్ సృష్టి... మది దోచే మట్టి రూపాలు
చిట్టి పలకా బలపం చిన్నారి చదువుకునే బడి పుస్తకం నోరూరించే నూడుల్స్, పిజ్జా... ఇడ్లీ, దోసె, మిర్చిబజ్జీ అందమైన పూల మొక్కలు.. ఆకట్టుకునే ముఖచిత్రాలు నూటొక్క పూవుల బతుకమ్మ.. నిదురించే చంటిబిడ్డ పూలవనాలు, పండ్ల రాశులు అన్నీ మట్టి రూపాలే.. మనసుదోచే కళారూపాలే! పార్వతి చేతుల్లో ప్రాణం పోసుకున్న పిండిబొమ్మల్లే స్ఫూర్తి చేతుల్లో వెలుగొందుతున్నాయి మట్టి బొమ్మలు ఆమె కళారూపాలు గ్రామ సరిహద్దులను దాటి విదేశీ గడ్డపైనా ముచ్చటగా మెరిసిపోతున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి వాసి అయిన స్ఫూర్తి మినియేచర్ సృష్టి... ముచ్చట ఇది.. క్లేతో ఆమె తయారు చేస్తున్న మినియేచర్స్కు దేశ విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కొనుగోలు చేస్తున్నవారు ఆనందం పొందుతుండగా, తయారు చేసి విక్రయించడం ద్వారా ఆమె ఉపాధి పొందుతోంది. కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్ కాలనీకి చెందిన శ్రీరాం, గంగల కూతురు స్ఫూర్తి దానబోయిన. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ యాక్ససరీస్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసింది. కొంత కాలం పోచంపల్లిలో లెదర్ కంపెనీలో హ్యాండ్ బ్యాగ్స్ తయారీలో, అలాగే కోల్‌కతాలో ఆరు నెలలపాటు ఉద్యోగం చేసింది. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ప్రయత్నించింది. అయితే ఆ సమయంలోనే ప్రపంచమంతటా కరోనా మహమ్మారి కమ్ముకోవడంతో పీజీ ఆలోచనను వాయిదా వేసుకుని ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఈ సమయంలో క్లేతో మినియేచర్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. అలా తయారు చేసిన వస్తువులను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయడంతో చాలా మంది అవి తమకు నచ్చాయని, తమకు కూడా కావాలంటూ ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పెట్టడం మొదలై ఇప్పుడు వందలాది ఆర్డర్లు వస్తున్నాయి. గడచిన రెండేళ్లుగా స్ఫూర్తి దాదాపు రూ.3 లక్షల విలువైన ఆర్డర్లు తీసుకుంది. రాత్రింబగళ్లూ క్లేతో వారు కోరిన బొమ్మలను తయారు చేసి, వాటిని పోస్ట్, కొరియర్ సర్వీసుల ద్వారా పంపిస్తోంది. దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు మన దేశంలో ఎక్కువగా మెట్రో సిటీలైన ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, లక్నో, తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. వారి ద్వారా విదేశాల్లో ఉన్న వారి వారి బంధువులు కూడా ఆర్డర్లు చేస్తున్నారు. దీంతో వారు కోరుకున్నవి తయారు చేసి పంపిస్తూ ఉపాధి పొందుతోంది. ప్రతి రోజూ ఆర్డర్లు వస్తూనే ఉంటాయని, రూ.150 మొదలుకొని రూ.1200 వరకు వివిధ రకాల మినియేచర్లు తయారు చేస్తున్నట్టు స్ఫూర్తి పేర్కొంది. ఇప్పటివరకు ఇంటి దగ్గర ఉంటూ మినియేచర్స్ తయారీ ద్వారా ఖర్చులన్నీ పోనూ దాదాపు రూ.3 లక్షలు ఆర్జించింది. అలంకార వస్తువులు మినియేచర్స్తోబాటు కొంత మంది మహిళలు తమకు కీచైన్స్ కావాలని, చెవులకు జూకాలు, లాకెట్స్, హెయిర్ క్లిప్‌లు... ఇలా రకరకాల అలంకార వస్తు సామగ్రి కావాలంటూ ఆర్డర్లు ఇస్తున్నారు. వాళ్లు కోరుకున్నట్టుగా తయారు చేస్తూ వారికి పంపిస్తోంది. స్ఫూర్తి ప్రతిభ దేశ, విదేశాలకు పాకింది. ఆమెకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్న చోటనే ఉపాధి పొందవచ్చని నిరూపిస్తోంది స్ఫూర్తి. ప్రశంసలే స్ఫూర్తిగా... క్లేతో మినియేచర్స్ తయారు చేస్తున్న స్ఫూర్తి పలువురి నుంచి అభినందనలు అందుకుంది. హైదరాబాద్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఆమె తయారు చేసిన మినియేచర్స్ను ప్రదర్శించడానికి ఆహ్వానం అందింది. దీంతో తాను తయారు చేసిన మినియేచర్స్ కళను ప్రదర్శించి నిర్వాహకుల నుంచి ప్రశంసలు, బహుమతులు అందుకుంది. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్న స్ఫూర్తి.. పేరుకు తగ్గట్టు అందరికీ స్ఫూర్తి ప్రదాత. అందమైన ఎంపిక మినియేచర్స్ తయారు చేయడం ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే వాటి తయారీ మొదలు పెట్టాను, సక్సెస్ అయ్యాను. వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. చాలా మంది నేను తయారు చేసిన మీనియేచర్లను కానుకలుగా ఎంపిక చేసుకోవడానికి ఇష్టం చూపుతున్నారు. ఆ విధంగానే ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి. – స్ఫూర్తి – ఎస్.వేణుగోపాలాచారి, కామారెడ్డి, సాక్షి -
ఇంటింటికీ రిక్వెస్ట్; ఆఫీసుకు పంపండి
ఈ ఏడాదిన్నరలో ఎంతోమంది మహిళలు.. కేవలం ఇంటిని చూసుకోవడం కోసం ఉద్యోగాలు మానేయవలసి వచ్చింది! వాళ్లను మళ్లీ ఉద్యోగాలలోకి రప్పించడం కోసం బెంగళూరు ‘లీన్ఇన్’ కంపెనీలో నెట్వర్క్ లీడర్‌గా పని చేస్తున్న స్ఫూర్తి అనే యువతి ఇంటింటికీ వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఒప్పించి ఆ ఉద్యోగినులను మళ్లీ ఆఫీసులకు రప్పిస్తోంది. ఇల్లు చేదోడుగా ఉంటే స్త్రీ ఆ ఇంటికి ఎంత చేయూతగా ఉంటుందో కొన్ని కుటుంబాలను ఉదాహరణగా చూపిస్తోంది. ఆమె చేస్తున్న ఈ ప్రయత్నంతో.. చీకటి పడగానే ఒకటొకటిగా ఇళ్లలోని లైట్లు వెలిగిన విధంగా తిరిగి ఉద్యోగాలలో చేరుతున్న మహిళల చిరునవ్వుతో కుటుంబాలు కాంతిమంతం అవుతున్నాయి. ఫేస్బుక్ సీవోవో కూడా స్ఫూర్తి చేస్తున్న ప్రయత్నానికి ముగ్ధురాలై ఆమె గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందనగా స్ఫూర్తిదాయకమైన పోస్ట్ పెట్టారు. షెరిల్ శాండ్‌బర్గ్ (51) వాషింగ్టన్లో ఉంటారు. ‘ఫేస్బుక్’ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆమె. ఇక స్ఫూర్తి బెంగళూరులో ఉంటుంది. అక్కడి ‘లీన్ఇన్’ కంపెనీలో స్ఫూర్తి నెట్వర్క్ లీడర్. మహిళలకు మద్దతుగా ఉండి, వారిని వారి లక్ష్యాలకు నడిపించే లాభాపేక్ష లేని సంస్థ లీన్ఇన్. శాండ్బర్గే స్వయంగా ఈ సంస్థను ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించారు. దాదాపు అన్ని దేశాల్లోనూ లీన్ఇన్ ఉంది. అయితే బెంగళూరులోని లీన్ఇన్లో మాత్రమే స్ఫూర్తి వంటి అమ్మాయి ఉంది! ఇలా చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఉద్యోగినులకు ఇంటి పనిలో ఏమాత్రం సహాయం లభించకపోగా, వారు గడప దాటితే గృహ భ్రమణం ఆగిపోయే పరిస్థితి అన్ని దేశాలలో ఉన్నప్పటికీ.. మనదేశంలో మరికాస్త ఎక్కువ అనిపించేలా గత ఏడాదిన్నరగా అనేక మంది మహిళలు కుటుంబం కోసం ఉద్యోగాలు మాని ఇంటికే పరిమితం అవవలసి వచ్చింది. స్ఫూర్తి వారందరినీ తిరిగి ఆఫీసులకు మళ్లించారు! అందుకే ఆమె శాండ్‌బర్గ్ దృష్టిలో పడ్డారు. స్ఫూర్తితో పాటు మహిళా ఉద్యోగులు కొందరు చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫొటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. స్ఫూర్తి ప్రయత్నాన్ని ప్రశంసించారు. నిజానికి ఇది స్ఫూర్తికి.. కంపెనీ అప్పగించిన బాధ్యత కాదు. ఆమెకై ఆమె చొరవ తీసుకుని ఇల్లిల్లూ తిరిగి సాధించిన ఘనత. అవును ఘనతే. బడి మానిన పిల్లల్ని తిరిగి బళ్లో చేర్పించడం వంటిదే.. ఉద్యోగం మానిన మహిళల్ని తిరిగి ఆఫీస్‌కి రప్పించడం! ఇంట్లో అనుకూలత లేకనే కదా ఆడపిల్లలు చదువు మానినా, గృహిణులు ఉద్యోగం మానినా. స్ఫూర్తి ఏం చేసిందంటే.. చక్కగా చదువుతోంది కదా ఎంత కష్టమైనా గాని పిల్లను బడి మాన్పించకండి అని తల్లిదండ్రులకు టీచర్లు చెప్పే విధంగానే.. ‘‘ఇంటిపనిలో మీరూ ఓ చెయ్యేస్తే ఆమెకు ఉద్యోగం మానే పరిస్థితి రాదు కదా..’’ అని కుటుంబ సభ్యులకు నచ్చ చెబుతోంది. స్ఫూర్తి మాట్లాడ్డం మృదువుగా, ఒప్పించేలా ఉంటుంది. లీన్ఇన్లో పనిచేసేవాళ్లంతా ఇదే విధంగా ఉంటారు. లీన్ఇన్లో ప్రధానంగా వాళ్లు చేస్తుండే పని ఆలోచన–ఆచరణ. మహిళలకు మద్దతుగా ఉండటం కోసం, మహిళల్ని వాళ్ల లక్ష్యాలకు దగ్గరగా చేర్చడం కోసం, మహిళల్ని సాధికార సాయుధులుగా మలచడం కోసం వర్తమాన సామాజిక అనుకూలతలు, ప్రతికూలతలను అనుసరించి ఒక ప్రణాళికను ఆలోచిస్తారు. ఆలోచనను ఆచరణలో పెడతారు. లాక్డౌన్లో ఉద్యోగినులకు ఇటు ఇంటిపనీ, అటు ఆఫీస్ పనీ ఎక్కువైంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగాలు మానేయడం మొదలుపెట్టారు! ఇంటికి ఆర్థికం గా నష్టం. సమాజానికి అభివృద్ధి పరంగా నష్టం. ఈ సంగతిని త్వరగా కనిపెట్టి, త్వరగా చక్కదిద్దడానికి కార్యోన్ముఖం అయింది స్ఫూర్తి. ఈ ఏడాదిన్నరలో బెంగళూరులో ఉద్యోగం మానేసిన వారు వందల్లో ఉన్నారని ఒక సర్వే ద్వారా తెలుసుకున్న స్ఫూర్తి వాళ్లను తిరిగి ఉద్యోగాలకు చేర్చడానికి ఒక నెట్‌వర్క్‌ను సిద్ధం చేసి వాళ్ల ఇళ్లకు పంపించింది. ఉద్యోగం మానిన వారిలో స్ఫూర్తి కో–వర్కర్స్ కూడా ఉన్నారు! వాళ్ల బాధ్యతను తను తీసుకుంది స్ఫూర్తి. వాళ్లంతా ఇప్పుడు ఉద్యోగాల్లోకి వచ్చేశారు. వెళ్లిన చోట స్ఫూర్తి చెప్పిన మాట ఒకటే. ‘‘చూడండి.. మీరు తనకు ఇంటి పనిలో సహాయం చేస్తుంటే.. ఆఫీస్ పనిని ఆమె సునాయాసంగా చేయగలదు. ఏ ఇల్లయినా ఒక ఉద్యోగాన్ని అనవసరంగా ఎందుకు కోల్పోవాలి?’’ అని ఇంటిల్లిపాదినీ ఒప్పించింది. అలాగే పనిని షేర్ చేసుకునే నమూనా ఇళ్లు ఎంత ఆనందంగా గడుపుతున్నాయో ఉదాహరణలు ఇచ్చింది. ‘‘థ్యాంక్యూ స్ఫూర్తీ.. ఇలాంటి క్లిష్ట సమయంలో మనం ఎలా ఉండాలో చూపించావు’ అనే మాటతో ఇన్‌స్టాగ్రామ్‌లో శాండ్‌బర్గ్ తన అభినందన పోస్ట్‌ను ముగించారు. ఫేస్బుక్ సీవోవో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలో స్ఫూర్తి (ఎడమ నుంచి రెండు) -
'స్ఫూర్తి'గా హన్సిక
శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'గౌతమ్ నంద'. గోపీచంద్ సరసన హన్సిక, కేథరీన్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్‌కు సంపత్ నంది దర్శకుడు. ఇప్పటికే కేథరిన్ క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసిన చిత్ర బృందం ఈ రోజు (శుక్రవారం) మరో కథానాయిక, హన్సిక లుక్ ను విడుదల చేశారు. కోలీవుడ్ లో బిజీగా హీరోయిన్ గా ఉన్న హన్సిక ఈ సినిమా స్ఫూర్తిగా కనపించనుంది. ట్రెడిషనల్ అమ్మాయిగా హన్సిక నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న గౌతమ్‌నంద ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆడియో వేడుకను గ్రాండ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాలని భావిస్తున్నారు. -
మూడేళ్ల వయస్సులో వరల్డ్ రికార్ట్
-
సూపర్ కిడ్
హైదరాబాద్ : వివిధ దేశాల రాజధానుల పేర్లు చెప్పండి అని మనల్ని ఎవరైనా అడిగితే కొన్ని చెప్పగలం.. మహాఅయితే 15-20 చెప్పగలం.. ఇంకా ఆలోచిస్తే 30 వరకు లాగవచ్చు. అయితే పట్టుమని మూడేళ్లు కూడా లేని చిన్నారి 68 దేశరాజధానుల పేర్లను ఒక్క నిమిషంలో చెప్పగలదు.అంతేనా ప్రపంచ పటంలో గుర్తింపు పొందిన 196 దేశాలు రాజధానుల పేర్లను కేవలం 3.30 నిమిషాల్లో గడగడా చెబుతుంది. హైదరాబాద్ కాప్రాకు చెందిన సోమగాని కిరణ్, శోభ దంపతుల కూరుతు స్ఫూర్తి తన ప్రతిభతో అబ్బురపరుస్తోంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్మొదలుకొని వండర్బుక్ ఆఫ్ రికార్డ్ వరకు దాదాపు 8 అంతర్జాతీయ రికార్డులను స్ఫూర్తి ఇది వరకే కైవసం చేసుకొంది. జర్మనీకీ చెందిన బొరీస్కొన్ర్డ్ ఒక నిమిషంలో 56 దేశాల రాజధానుల పేర్లు చెప్పి రికార్డుకెక్కాడు. మరి ఈ చిన్నారి అతని రికార్డును మంగళవారం నాడు ఉస్మానియా క్యాంపస్ సాక్షిగా తిరగరాస్తాదని స్ఫూర్తి తల్లిదండ్రులు చెబుతున్నారు. అంతేనా రసాయన శాస్త్రంలో పలకడానికి కష్టంగా ఉండే 80 మూలకాలను సైతం చెప్పగలదు. దేశంలో గుర్తింపు పొందిన పార్టీల వ్యవస్థాపకుల మొదలు ప్రముఖ వ్యక్తిగత బయోటేటాను సైతం చెప్పగలదు. గిన్నిస్ రికార్డ్‌కి సంబంధించిన కార్యక్రమం మంగళవారం ఉస్మానియా క్యాంపస్‌లో జరగనున్నదని తల్లిదండ్రులు సోమగాని కిరణ్, శోభ దంపతులు తెలిపారు.