వివిధ దేశాల రాజధానుల పేర్లు చెప్పండి అని మనల్ని ఎవరైనా అడిగితే కొన్ని చెప్పగలం..
హైదరాబాద్ : వివిధ దేశాల రాజధానుల పేర్లు చెప్పండి అని మనల్ని ఎవరైనా అడిగితే కొన్ని చెప్పగలం.. మహాఅయితే 15-20 చెప్పగలం.. ఇంకా ఆలోచిస్తే 30 వరకు లాగవచ్చు.
అయితే పట్టుమని మూడేళ్లు కూడా లేని చిన్నారి 68 దేశరాజధానుల పేర్లను ఒక్క నిమిషంలో చెప్పగలదు.అంతేనా ప్రపంచ పటంలో గుర్తింపు పొందిన 196 దేశాలు రాజధానుల పేర్లను కేవలం 3.30 నిమిషాల్లో గడగడా చెబుతుంది. హైదరాబాద్ కాప్రాకు చెందిన సోమగాని కిరణ్, శోభ దంపతుల కూరుతు స్ఫూర్తి తన ప్రతిభతో అబ్బురపరుస్తోంది.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్‌మొదలుకొని వండర్‌బుక్ ఆఫ్ రికార్డ్ వరకు దాదాపు 8 అంతర్జాతీయ రికార్డులను స్ఫూర్తి ఇది వరకే కైవసం చేసుకొంది. జర్మనీకీ చెందిన బొరీస్‌కొన్‌ర్డ్ ఒక నిమిషంలో 56 దేశాల రాజధానుల పేర్లు చెప్పి రికార్డుకెక్కాడు. మరి ఈ చిన్నారి అతని రికార్డును మంగళవారం నాడు ఉస్మానియా క్యాంపస్ సాక్షిగా తిరగరాస్తాదని స్ఫూర్తి తల్లిదండ్రులు చెబుతున్నారు.
అంతేనా రసాయన శాస్త్రంలో పలకడానికి కష్టంగా ఉండే 80 మూలకాలను సైతం చెప్పగలదు. దేశంలో గుర్తింపు పొందిన పార్టీల వ్యవస్థాపకుల మొదలు ప్రముఖ వ్యక్తిగత బయోటేటాను సైతం చెప్పగలదు. గిన్నిస్ రికార్డ్‌కి సంబంధించిన కార్యక్రమం మంగళవారం ఉస్మానియా క్యాంపస్‌లో జరగనున్నదని తల్లిదండ్రులు సోమగాని కిరణ్, శోభ దంపతులు తెలిపారు.