సినిమా: తమిళ చిత్రాల్లో నటించడమే నాకు సౌకర్యం అని నటి హన్సిక పేర్కొంది. ఈ బ్యూటీ పుట్టింది ముంబయిలో అయినా నటిగా ఎదిగింది మాత్రం దక్షిణాదిలోనే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధనుష్‌కు జంటగా మాప్పిళ్‌లైచిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ అమ్మడు ఆ తరువాత ప్రభుదేవా, విజయ్, విశాల్, ధనుష్, సిద్ధార్థ్‌అంటూ యువ స్టార్స్ అందిరితోనూ నటించి క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అదేవిధంగా తెలుగులోనూ పలుచిత్రాలు చేస్తూ మంచి గుర్తింపు పొందింది. తాజాగా మాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఇలా దక్షిణాదినేనమ్ముకున్న హన్సిక నటిగా అర్ధ సెంచరీకి చేరుకుంది. బుధవారం ఈ అమ్మడు చెన్నైలో ఒక కార్యక్రమంలోపాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా సాక్షిఈ బ్యూటీని పలకరించింది. ఆ ముచ్చట్లు చూద్దాం.
ప్ర: హాయ్ చెన్నైకి వచ్చి చాలా కాలం అయినట్లుంది?
జ: మనం కలిసి చాలా కాలమై ఉండవచ్చు గానీ, తాను చెన్నైకి షూటింగ్‌ల కోసం తరచూ వస్తూనే ఉన్నాను.
ప్ర: సరే తాజా చిత్రాల గురించి చెప్పండి?
జ: ప్రస్తుతం తమిళంలో విక్రమ్‌ప్రభుకు జంటగా తుపాకీ మునై, అధర్వ సరసన 100, మహా సహా మూడు చిత్రాలు చేస్తున్నాను. వీటిలో తుపాకీ మునై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ఇది యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుంది. 100 చిత్రం మరో కోణంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం. ఇకపోతే మహా చిత్రం అర్ధసెంచరీ మైలు రాయిని టచ్ చేసిన చిత్రం. అంతే కాదు నేను తొలిసారిగా నటిస్తున్న లేడీ ఓయెంటెడ్ కథా చిత్రం ఇది. దీంతో మహా నా కేరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
ప్ర: మహా ఏ తరహా కథా చిత్రం?
జ: ఇదీ థ్రిల్లర్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న కథా చిత్రమే. అయితే నేనిప్పటి వరకూ చేయనటువంటి పాత్రను ఇందులో చేస్తున్నాను.
ప్ర:50వ చిత్రం అంటున్నారు ఎలా ఫీలవుతున్నారు?
జ: చాలా తక్కువ కాలంలోనే 50 చిత్రాలు చేయడం సంతోషంగా ఉంది. అదే సమయంలో భయంగానూ ఉంది. నటిగా నాపై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నారు. ఇక మహా చిత్రంలో నటించడాన్ని చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు.
ప్ర: తమిళం, తెలుగు, మలయాళం ఇతర భాషా చిత్రాల్లోనూ నటిస్తున్నారు ఏ భాషా చిత్రాల్లో నటించడం ఇష్టం?
జ:నాకు తమిళ చిత్రాల్లో నటించడమే సౌకర్యంగా ఉంటుంది. తెలుగు, మలయాళం భాషల్లో నటించినా, తమిళంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ప్రస్తుతం తమిళ చిత్రాల్లోనే నటిస్తున్నాను.
ప్ర: ప్రస్తుత తమిళ రాజకీయాల గురించి మీ కామెంట్?
జ: రాజకీయాల గురించి మాట్లాడే వయసు కాదు నాది. అయినా ప్రస్తుతం నా దృష్టి అంతా నటనపైనే.
ప్ర:భవిష్యత్ ప్రణాళికలేమైనా ఉన్నాయా?
జ: ప్రణాళికలంటూ ఏమీ లేవు. నేనిప్పటికి 31 మంది పిల్లలను దత్తత తీసుకున్నాను. వారి రక్షణ బాధ్యత నాపై ఉంది. వారి కోసం ముంబయిలో ఆశ్రమాన్ని కట్టిస్తున్నాను. అది త్వరలో పూర్తి అయ్యే దశలో ఉంది
ప్ర: ముంబయిలో పెద్ద ప్యాలెస్‌ను కట్టిస్తున్నారట. అందులో ప్రిన్సెస్ మీరు. మరి ప్రిన్స్ వచ్చేదెప్పుడు?
జ: క్వీన్‌గా అమ్మ ఉంది, కింగ్‌గా సోదరుడు ఉన్నాడు. ప్రిన్సెస్ నేను ఉన్నాను. ప్రిన్స్ ఎవరన్నది ఇంకా తెలియదు.
Comments
Please login to add a commentAdd a comment