మణిరత్నం క్లాసిక్లో ఛాన్స్ కొట్టేశాడు
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిచయం అయి.., ప్రస్తుతం బాలీవుడ్లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యువ నటుడు హర్షవర్థన్ రాణే. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాల్లో లీడ్ రోల్లో నటించిన ఈ మ్యాన్లీ హీరో, స్టార్ ఇమేజ్ మాత్రం సాధించుకోలేకపోయాడు. ఇలాంటి సమయంలో ఓ గోల్డెన్ ఛాన్స్ రాణేను వెతుక్కుంటూ వచ్చింది.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కి, ఘనవిజయం సాధించిన క్లాసిక్ ఘర్షణ. ఇప్పుడు ఈ సినిమాను బెజోయ్ నంభియార్ దర్శకత్వంలో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే కార్తీక్ చేసిన పాత్రకు తమిళ స్టార్ ధనుష్ను ఎంపిక చేయగా.. తాజాగా ప్రభు పాత్రకు హర్షవర్థన్ రాణేను తీసుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాతో అయినా హర్షవర్ధన్ రాణేకు బ్రేక్ వస్తుందేమో చూడాలి.