Harshvardhan Rane
-
అందుకు నా డీఎన్ఏనే తప్పుబట్టాలి: నటుడు
ముంబై: ‘‘ఇందులో దాచడానికి ఏమీ లేదు. మేము కొన్నాళ్లపాటు కలిసే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ బంధం ముగిసిపోయింది’’అంటూ నటుడు హర్షవర్ధన్ రాణే తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చాడు. తన వ్యవహారశైలి, ఆలోచనా విధానమే కిమ్ శర్మ నుంచి తనను దూరం చేశాయన్నాడు. అయితే ఆమెతో గడిపిన సమయం జీవితంలోనే అత్యంత మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని, ఈ భూమి మీద ఉన్న హాస్యచతురత గల మనుషుల్లో కిమ్ ముందు వరుసలో ఉంటుందన్నాడు. కాగా తకిట తకిట మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన హర్షవర్ధన్... రవిబాబు ‘అవును’, ‘అవును2’ చిత్రాల ద్వారా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాలో అతిథి పాత్రలో కన్పించాడు. (చదవండి: షారుఖ్ ‘మన్నత్’ను అమ్మేస్తున్నాడా?!) ఇక 2016లో సనమ్ తేరీ కసమ్ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హర్షవర్ధన్, ప్రస్తుతం తైష్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. జీ5 ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలయ్యేందుకు ఈ మూవీ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ వెబ్‌సైట్‌తో ముచ్చటించిన అతడు తన వృత్తిగత, వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు వెల్లడించాడు. కిమ్ శర్మ, తాను ప్రేమలో ఉన్నట్లు హర్షవర్దన్ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ జంట గుడ్‌బై చెప్పుకొంది. ఈ క్రమంలో.. ‘‘నీతో గడిపిన సమయం అత్యద్భుతం. ఆ దేవుడు నిన్నూ, నన్నూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. బై’’అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు. ఈ విషయం గురించి తాజాగా మాట్లాడుతూ.. ‘‘నా డీఎన్ఏలోనే ఏదో తప్పు జరిగింది. 12 ఏళ్లపాటు నేను ఒంటరిగానే ఉన్నాను. నిజానికి ఏ కారణం లేకుండా ఎవరూ విడిపోరు. ఇప్పుడు నా వధువు స్వతంత్రురాలు. అలాగే సినిమానే ఇప్పుడు నా పెళ్లికూతురు’’ అంటూ రంగ్ దే బసంతి సినిమాలోని డైలాగ్‌ను ఉటంకిస్తూ, ఇకపై కెరీర్‌పైనే తాను దృష్టి సారించనున్నట్లు వెల్లడించాడు. ఇక ‘మొహబ్బతే’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిమ్ శర్మ.. ఫిదా, తుమ్సే అచ్చా కౌన్ హై, కహెతా హై దిల్ బార్ బార్ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో ఖడ్గం సినిమాలో మెరిసిన ఈ భామ.. ‘మగధీర’లో ప్రత్యేక గీతంలో నర్తించింది. 2010లో వ్యాపారవేత్త అలీ పుంజానీని పెళ్లాడిన కిమ్... విభేదాల కారణంగా ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటోంది.(యువీ హార్ట్ టచింగ్ పోస్ట్: కిమ్ రిప్లై) -
‘అవును... రిలేషన్షిప్లో ఉన్నాం’
బాలీవుడ్ నటి కిమ్ శర్మ, తాను రిలేషన్షిప్లో ఉన్నామని స్పష్టం చేశాడు ‘అవును’ సినిమా ఫేం హర్షవర్ధన్ రాణే. గత కొంత కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంటపై బీ- టౌన్లో రూమర్లు ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎప్పుడూ కూడా తమ మధ్య ఉన్న బంధం గురించి వీరు నోరు విప్పలేదు. ఈ క్రమంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన హర్షవర్ధన్... ‘నేను చాలా ఓపెన్‌గా ఉంటాను. ఇందులో దాయాల్సింది ఏమీలేదు. అవును ప్రస్తుతం తన(కిమ్)తో రిలేషన్షిప్లో ఉన్నా. తన గురించి నాకు శ్రద్ధ ఉంటుంది కదా. అందుకే వ్యక్తిగత విషయాల గురించి చర్చించదలచుకోలేదు. టీనేజ్లోనే ఇంటి నుంచి పారిపోయి బయటికి వచ్చాను. సైబర్ కేఫ్‌లో కొన్నాళ్లు, ఎస్టీడీ బూత్‌లో మరికొంత కాలం పనిచేశాను. ఇప్పుడు నటుడిగా స్థిరపడ్డాను. నా జీవితం తెరచిన పుస్తకమే’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా, షారుఖ్‌ఖాన్, అమితాబ్ బచ్చన్ నటించిన ‘మొహబ్బతే’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిమ్ శర్మ.. ఫిదా, తుమ్సే అచ్చా కౌన్ హై, కహెతా హై దిల్ బార్ బార్ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో ఖడ్గం సినిమాలో మెరిసిన ఈ భామ.. ‘మగధీర’లో ప్రత్యేక గీతంలో నర్తించింది. 2010లో వ్యాపారవేత్త అలీ పుంజానీని పెళ్లాడిన కిమ్... విభేదాల కారణంగా ప్రస్తుతం భర్తకు దూరంగా ఉంటోంది. ఇక తకిట తకిట సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హర్షవర్ధన్... రవిబాబు ‘అవును’, ‘అవును2’ చిత్రాల ద్వారా ఫేమస్ అయ్యాడు. తాజాగా ‘ఫిదా’ సినిమాలో అతిథి పాత్రలో కన్పించాడు. 2016లో సనమ్ తేరీ కసమ్ ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. -
‘బృందావనమది అందరిది’ మూవీ స్టిల్స్
-
మణిరత్నం క్లాసిక్‌లో ఛాన్స్ కొట్టేశాడు
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయి.., ప్రస్తుతం బాలీవుడ్లో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న యువ నటుడు హర్షవర్థన్ రాణే. ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాల్లో లీడ్ రోల్లో నటించిన ఈ మ్యాన్లీ హీరో, స్టార్ ఇమేజ్ మాత్రం సాధించుకోలేకపోయాడు. ఇలాంటి సమయంలో ఓ గోల్డెన్ ఛాన్స్ రాణేను వెతుక్కుంటూ వచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కి, ఘనవిజయం సాధించిన క్లాసిక్ ఘర్షణ. ఇప్పుడు ఈ సినిమాను బెజోయ్ నంభియార్ దర్శకత్వంలో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే కార్తీక్ చేసిన పాత్రకు తమిళ స్టార్ ధనుష్‌ను ఎంపిక చేయగా.. తాజాగా ప్రభు పాత్రకు హర్షవర్థన్ రాణేను తీసుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాతో అయినా హర్షవర్ధన్ రాణేకు బ్రేక్ వస్తుందేమో చూడాలి. -
అనామిక మూవీ మరియు వర్కింగ్ స్టిల్స్
-
ప్రేమకు భాష లేదు...
ప్రేమకు భాషతో సంబంధం లేదు. దానిక్కావల్సిందల్లా రెండు హృదయాలు కలవడమే. మనసులు కలిసిన తర్వాత ఎవరికి నచ్చిన రీతిలో వాళ్లు ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. అలా మూడు జంటలు ‘ప్రేమ... ఇష్క్... కాదల్’ అంటూ మురిపెంగా తమ ప్రేమను వ్యక్తం చేసుకున్నాయి. ఇష్క్ అన్నా ప్రేమే... కాదల్కీ అదే అర్థం. ఒకే అర్థం వచ్చే ఈ మాటను మూడు భాషల్లో ఎందుకు చెప్పినట్లు...? అదే సస్పెన్స్ అంటున్నారు బెక్కెం వేణుగోపాల్ (గోపి). అగ్ర నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పణలో షిర్డిసాయి కంబైన్స్ భాగస్వామ్యంతో లక్కీ మీడియా పతాకంపై ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ ఇష్క్ కాదల్’. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన పవన్ సాదినేని ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. హర్షవర్థన్ రాణే, విష్ణు, హరీష్, వితిక షేరు, రీతూవర్మ, శ్రీముఖి ఇందులో హీరో హీరోయిన్లు. ఈ నెల 24న మధుర ఆడియో ద్వారా పాటల్ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత గోపి మాట్లాడుతూ -‘‘శ్రవణ్ స్వరపరచిన పాటలు ఈ సినిమాకు మెయిన్ హైలైట్. పాటలన్నీ వీనుల విందుగానే కాదు.. కనువిందుగానూ ఉంటాయి. సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు. దర్శకుడు పవన్ సాదినేని మాట్లాడుతూ - ‘‘భారీ నిర్మాణ విలువలతో స్టయిలిష్‌గా రూపొందుతోన్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. మూడు జంటల ప్రేమాయణాన్ని సరికొత్త రీతిలో ఆవిష్కరించాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, కళ: మోహన్, కూర్పు: గౌతమ్ నెరుసు, పాటలు: కృష్ణచైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కైగురి.